కాకినాడ హైవేపై కారు బీభత్సం… CCTV వీడియో వైరల్..
కాకినాడ జిల్లా తేటగుంటలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
జాతీయ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి… హోటల్ బయట పార్కింగ్లో ఉన్న మూడు కార్లను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పార్క్ చేసిన వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
అక్కడ విధులు నిర్వహిస్తున్న హోటల్ సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం.
ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..