తెలంగాణ ఉద్యమకారుల అధ్వర్యంలో పాలాభిషేకం..!

ప్రజాప్రభుత్వంలోనే తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం.తెలంగాణ ఉద్యమకారుల అధ్వర్యంలో పాలాభిషేకం..

హుజూర్‌నగర్……

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి మలిదశ ఉద్యమ కారులకు న్యాయం చేయడం కోసం ఏర్పాటు చేసిన కేకే కన్వీనర్ గా కమిటీని అభినందిస్తూ ఆదివారం స్తానిక ఎంపీడిఓ కార్యాలయ ఆవరణలో హుజూర్‌నగర్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమ కారుల అధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారుల కన్వీనర్ మేకల నాగేశ్వరరావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు, పోలీస్ కేసులు సైతం లెక్క చేయకుండాపోరాడిన ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేయాలన్నారు. నియోజకవర్గాల వారిగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు యడ్ల విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు వేములూరి రంగాచారి, కెఎల్ఎన్ రావు, ముత్తినేని వెంకటేశ్వరరావు, నూకల చంద్రం , కొండలున్న, బిక్షం , చిలకరాజు అజయ్ కుమార్, గోపు చలీనమ్మ, జూలకంటి రామనర్శమ్మ, మంగమ్మ మెండెం పెద్ద లక్ష్మీనరసయ్య, కామిశెట్టి శేషగిరి, చింతలపూడి ఉమా మహేశ్వర్, జక్కుల నరేందర్, బెల్లంకొండ శ్రీనివాస్, తేజావత్ రవినాయక్, కడియాల రామకృష్ణ, శిల్ప శ్రీను , పిడమర్తి ఇంద్రబాబు, ఎరగాని రామస్వామి, ఎండి లతీఫ్, షబ్బు, కుందూరు కోటిరెడ్డి చేపూరి అనంత రాములు, పిండిప్రోల్ కోటేశ్వరరావు ఓర్స్ వెంకన్న, జక్కుల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.