మళ్లీ మొదలైన ఆంధ్ర, తెలంగాణ, యాస పై పంచాయతీ..!

సోషల్ మీడియాలో ఉదృతంగా తెలంగాణ ఆంధ్ర అంటూ మళ్లీ మొదలైన భేదభిప్రాయాలు..

నాయకుల స్వలాభం కోసం ప్రజల మధ్య చుచ్చు..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన యాస ఉన్న అన్నదమ్ముల కలిసి ఉండేవారు.. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకరి యాసపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు..

సినిమా టైటిల్పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ.

ఇడుపుకాయితం’ సినిమా టైటిల్పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. అసలు ఈ టైటిల్కు అర్థం ఏమిటి? ఈ టైటిల్ పెట్టడానికి గల కారణమేంటని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ఈ చిత్ర నిర్మాత బన్నీవాసు తాజాగా దీనిపై స్పందించారు. ఓ సినిమా ఈవెంట్లో హాజరైన బన్ని వాసు ఈ కాంట్రవర్సీపై స్పందించారు..

తెలంగాణ వాదుల

అర్థం కానీ హిందీ సినిమాలు చూస్తరు గదా, ఒక్క ముక్క మాట్లడలేరు. మరి అరవై ఏండ్ల నుంచి ఇంటున్న తెలుగు అర్థం కాదా? లేక నాటకాలా? మరి మా నెత్తిన ఆ అనాగరిక సీన్మలు రుద్దారు. మేమేమన్నాం? పక్కవాడిని కొట్టడం గేలిచేయడం- అదే హాస్యం గదా మీకు? సీన్మలో ఏ హీరో అయినా కారో, మోటరు బైకో దిగి దాన్ని గేటుకు అడ్డంగా పెట్టి గేటు తీసుకొని వస్తాడు కదా! తీసిన గేటు వేసిన హీరోను నేను ఏ సీన్మలో చూడలే! అమ్మాయిల కొంగులు లాగే హీరోలు, వారిని ఎట్లా పడేయాలి అని కాలేజీల్ల్లో చర్చించే పోరలు, పాఠం చెప్పే గురువును రకరకాలుగా ఏడిపించే అబ్బాయిలు ఇవన్నీ మా సీన్మలల్ల లేనందున మీకు నచ్చవు. మీరు మా సీన్మలు చూడొద్దు, మేము మీ సీన్మలు చూడము. సరేనా? అసలు మీ అనాగరిక సీన్మలు మాకు వద్దు, మా పోరలు ఇప్పటికే చెడిపోయి, తన రాష్ర్టానికి ఏమీ చెయ్యని మంత్రిని హీరో అనుకొని వెంటపడుతున్నరు. గిట్ల పాడైతే మా తెలంగాణ సంస్కృతి పాడైతది. గప్పుడు మేం కూడా రెండర్థాల పాటలు, రికార్డింగ్‌ డాన్సులలోకి దిగాలి. నేరేడుపండు రంగు పాంటు, గులాబీ రంగు అంగీ వేసుకొని లిప్‌స్టిక్‌ పెట్టుకొని మీ డాన్సుబాబు లాగ మా పోరలను చూడలేం! మీ డబ్భు ఏండ్ల సోపతిలో నా భాష గూడ చెడిపోయింది!

ఇక మీరు అనువాదం అక్కరలేకుండా మీ భాషలో చెప్తాను అసలు మాకు కొన్ని సందేహాలొస్తాయి. వచ్చింది అనే పదం అమెకు వాడుతాం, మరి ఆయన వచ్చిండు అనాలి కదా సరిగ్గా భాష తెలిస్తే? ఈ వచ్చాడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటివి రాస్తే ఒక పుస్తకం నిండుతుంది. మీరు మీ అమ్మాయిని పుట్టింటికి తీసుకొస్తారు, మేం మా బిడ్డను తొలుకొస్తాం. అంటే వారే నడిచి వస్తారు ఇంట్లోకి, తీసుకురావక్కర లేదు. ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు తన సెగట్రీని అడుగుతాడు. రాయుడు వచ్చాడా? తీసుకొచ్చావా? అని. అంటే అర్థమైందనుకుంటాను. నెల్లూరులో పెరిగిన వాళ్లు షాపులో ఏదైనా వస్తువు కొనడానికి ఎత్తి అంటారని మాకు తెలియదు. ఒకసారి ఒక ఆవిడ మా అమ్మగారి దగ్గర కొంచెం డబ్బు అప్పు తీసుకొని తర్వాత ఇస్తా అనడానికి బదులు చీర ఎత్తినంక ఇస్తానండీ అనగానే మా అమ్మగారు కంగారుపడి సరే సరే అని ఆవిడని పంపించేశారు. అలాగే ఒకసారి ఒక బిచ్చగాడు మా ఇంటి ముందు నుంచుని పిలిచాడు ఏదైనా వేయమని.

సోషల్ మీడియాలో యాసల పై రెచ్చిపోయి కామెంట్స్..

తెలంగాణ యాస అర్థం కాకుండా ఉంటుందని మరికొందరు తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు గుర్తించుకుంటున్నారు..

ఆంధ్ర యాస విభిన్న రకాలుగా ఉంటుందంటూ మరికొందరు పరస్పరం కామెంట్స్ పెట్టుకుంటున్నారు.. ఇన్నాళ్లు అన్నదమ్ముల కలుస్తున్న తెలుగు రాష్ట్రాలపై కావాలని కొందరు రాజకీయ నాయకులు యసలపై భాషలపై విమర్శలు గుప్పించి ఉదృత లను సృష్టిస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు….

ప్రాంతాల పట్ల నాయకుల మాటలు విని సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు చేసుకుంటే అన్నదమ్ముల కలిసి ఉన్న మనం రేపు శత్రువుల కొట్టుకునే పరిస్థితి వస్తుందని అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు…

ప్రాంతాలుగా మాత్రమే వేరు.. అందరం తెలుగువారమే అందరం కలిసి మెలిసి ఉండాలి అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం..