_• తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో మార్చి 16 నుంచి హాఫ్‌డే తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ E. Naveen Nicolas ఆదేశాలు జారీ చేశారు.
_• విద్యాసంవత్సరం 2025–26 చివరి పని దినమైన ఏప్రిల్ 23 వరకు ఈ హాఫ్‌డే పద్ధతి కొనసాగుతుంది._
_• ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలి._
_మధ్యాహ్న భోజనం (Mid-Day Meal)ను 12:30 గంటలకు అందించనున్నారు._
_• SSC Public Examination కు సిద్ధమవుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి._
_• ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు పరీక్షల రోజుల్లో మాత్రమే మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు పని చేస్తాయి. మిగతా రోజుల్లో సాధారణంగా హాఫ్‌డే పాఠశాల సమయాలు అమల్లో ఉంటాయి._