ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్.భారత్ జెండాతో ఉన్న నౌకలు హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతి…

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇరాన్‌సైతం ఇజ్రాయెల్‌తో‌పాటు గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత మోగిస్తోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం lనెలకొన్న విషయం తెలిసిందే. చముర రవాణాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఆయిల్ సరఫరా ఆగిపోయింది. దీంతో భారత్ దేశంతోపాటు ఎన్నో దేశాలలో చమురు, వంటగ్యాస్ కొరత ఏర్పడింది. అయితే, తాజాగా.. భారతదేశానికి భారీ ఊరట లభించింది. ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్ చెప్పింది…
భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య చర్చలు జరిగాయి. యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి జైశంకర్ – అరాగ్చీల మధ్య మూడుసార్లు చర్చలు జరిగాయి. మంగళవారం ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ వాటిల్లో ఒకటి. ఈ చర్చలు ఫలితంగా భారత దేశానికి ఉపశమనం లభించింది. భారత్ జెండాతో ఉన్న నౌకలు హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెల్లడించాయి. ఈ చర్చల ఫలితంగా పుష్పక్, పరిమళ్ పేరిట ఉన్న రెండు ఇండియన్ ట్యాంకర్లు హర్మూజ్ జలసంధిని దాటినట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే ఒక నౌక ముంబయికి చేరుకోగా.. మరో రెండు రోజుల్లో మరో నౌక భారతదేశానికి రానుంది….