వెళ్లి మోదీకి చెప్పుకోండి…

ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా!..

దాడి జరిగినప్పుడు అతని భార్య పల్లవి, కొడుకుతో కలిసి అక్కడే ఉన్నారు..

పల్లవి చెప్పిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వారు పహల్గామ్ వద్ద ఉన్న సమయంలో ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు తుపాకులతో వచ్చి ఆకస్మికంగా దాడి చేశారు. మంజునాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిని తన కళ్లముందే చూసిన పల్లవి తట్టుకోలేని విషాదంలో ఉన్నారు. ఆమె వివరించిన ప్రకారం, దాడికి పాల్పడిన వారిలో ఒకరు మతపరమైన మాటలు చెప్పినట్టు తెలిపారు.

దాడి అనంతరం పల్లవికి అక్కడి స్థానికులు సహాయం చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, దాడికి పాల్పడిన వారిలో ఒకరు ఆమెను చంపకుండా, ప్రధానిని ఉద్దేశిస్తూ ఒక వ్యాఖ్య చేశాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ దాడి ఉద్దేశపూర్వకంగా హిందువులను లక్ష్యంగా చేసుకొని జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే మంజునాథ్ మృతదేహాన్ని వెంటనే కర్ణాటకకు తరలించేందుకు సహకరించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఆ ప్రాంతం పర్వత ప్రాంతమైన కారణంగా మృతదేహాన్ని తరలించేందుకు సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అందుకే హెలికాప్టర్ ద్వారా మృతదేహాన్ని తరలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ దాడిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా స్పందించారు. ఉగ్రదాడిలో కర్ణాటక వాసి ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కేంద్రానికి సమాచారం అందించామని, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన మళ్లీ కాశ్మీర్‌లో హిందువుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పర్యాటకులపై జరిగిన ఈ దాడి మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్నదని సోషల్ మీడియాలో ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు..

ఇది దారుణం…

అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌లో 27 మంది మృతి చెందిన ఘటన తెలిసిందే. కేవలం పర్యాటకులనే టార్గెట్‌ చేసి అటాక్ చేశారు..టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే కొందరు అబద్ధం చెబుతారు ఏమోనని మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు. మరికొందరి ఐడీ కార్డులు చెక్ చేసి హతమార్చారు. సమ్మర్ వెకేషన్, హనీమూన్‌కి వెళ్లిన వారు ఈ ఉగ్రదాడికి బలి అయ్యారు..

ఇద్దరు తెలుగు వాసులు

ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి చెందారు. కశ్మీర్‌ నరమేథంలో రిటైర్డ్ బ్యాంక్‌ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి పారిపోతున్నా.. ఉగ్రవాదులు ఆయనను వెంటాడి మరీ చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు..

నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌ అనే తెలుగు వ్యక్తి కూడా ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. మధుసూదన్‌ బెంగూళురులో స్థిరపడినట్లు తెలుస్తుంది.కుటుంబంతో కలిసి ఆయన కశ్మీర్‌యాత్రకు వెళ్లారు.ఇంతలోనే ఈ ఘోరం జరిగింది.హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మనీశ్‌ రంజన్‌ మృతి చెందారు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కార్యాలయంలో సెక్షన్‌ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు..