TFDC (తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ) ఛైర్మన్గా నిర్మాత దిల్ రాజు..
టీఎఫ్డీసీ ఛైర్మన్గా నిర్మాత దిల్ రాజు
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్గా రాజును నియమించింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు…
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ నిర్మాత దిల్రాజును తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్(TSFDC Chairman)గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. తెలుగు ఇండస్ట్రీలో భారీ చిత్రాలనే కాదు చిన్న చిత్రాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తున్నారు దిల్ రాజు. తెలుగు పరిశ్రమలోకి కొత్తగా వచ్చేవాళ్లను మరింతగా ప్రోత్సహించేందుకు దిల్రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్ను క్రియేట్ చేశారు. ఈ పేరుతో ఓ వెబ్సైట్ను కూడా లాంచ్ చేయబోతున్నారు.