Thared Phase Panchayat Elections..అమరావతి: మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు..
ఈ నెల 13న తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్..
ఈ నెల 26న తొలి విడత పోలింగ్, ఫలితాలు
ఈ నెల 16న రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్..
29న రెండో విడత పోలింగ్..
19న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..
డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్, ఫలితాలు..
మూడు విడతల్లో 13,354 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు..
తొలి విడత నామినేషన్లకు ఈ నెల 17 చివరి తేదీ..
రెండో విడత నామినేషన్లకు ఈ నెల 20 చివరి గడువు..
మూడో విడత నామినేషన్లకు ఈ నెల 23 చివరి తేదీ..
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు,మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మరోవైపు మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల ఎన్నికల (MPTC ZPTC Elections) నిర్వహణ ప్రక్రియ శనివారంతో ముగిసింది. దాంతో ఎన్నికలు జరగాల్సిన గ్రామీణ ప్రాంతాలు మినహా మిగతా ఏపీ రాష్ట్రమంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును ఈనెల 7వతేది రాత్రి 10 గంటల నుంచి ఎత్తివేశారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఉత్తర్వులు జారీ చేశారు..ఏపీలో ఇంకా గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇదివరకే ఎన్నికల షెడ్యూల్ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేటా విడుదల చేయగా.. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేసి నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి యదావిధిగా అమలులో ఉంటుందని ఏపీ ఎస్ఈసీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.
Thared Phase Panchayat Elections