కూటమి ప్రభుత్వనికి షాక్… హీట్ పెంచిన ఈ హోరాహోరీ పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం..
తిరుపతి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల లెక్కింపులో తీవ్ర ఉత్కంఠ రేపిన తిరుపతి (Tirupati Rural ZPTC Result)రూరల్ జెడ్పీటీసీ స్థాన ఫలితం ఎట్టకేలకు వెలువడింది. పొలిటికల్ హీట్ పెంచిన ఈ హోరాహోరీ పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 602 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సాధించి అధికారుల నుంచి డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన చిన్న కుమారుడైన హర్షిత్ రెడ్డిని బరిలోకి దింపి గెలిపించుకోవడంతో వారి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.