విడదల రజినిని తోసేసిన ఎస్సైపై ఎస్ఈసీ చర్యలు..

*విడదల రజినిని తోసేసిన ఎస్సైపై ఎస్ఈసీ చర్యలు*

చిలకలూరిపేట ఎస్సై ప్రియాంకను విధుల నుంచి తొలగించాలని ఎస్ఈసీ ఆదేశాలు.

నిన్న విడదల రజిని నివాసం వద్ద ఘటన.

ఇంటి నుంచి బయటకు రాకుండా విడదల రజినిని అడ్డుకున్న ఎస్సై ప్రియాంక.

ఎస్సై నెట్టడంతో కిందపడిన మాజీ మంత్రి విడదల రజిని.

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేపిన ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అత్యంత తీవ్రంగా స్పందించింది. నామినేషన్ పత్రాలు, బి-ఫామ్ అందజేసేందుకు తన నివాసం నుంచి బయటకు వస్తున్న మాజీ మంత్రి విడదల రజినిని Vidadala Rajini అడ్డుకోవడమే కాకుండా, ఆమెపై దురుసుగా వ్యవహరించి కిందకు తోసేసిన చిలకలూరిపేట రూరల్ ఎస్సై లేఖా ప్రియాంకపై ఎస్ఈసీ సీరియస్ అయింది..మాజీ మంత్రి విడదల రజినిని తోసివేయడంతో ఆమె కిందపడిన ఘటనకు సంబంధించిన వీడియోలు, మీడియా కథనాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్ఈసీ, ఎస్సై ప్రియాంకను తక్షణమే విధుల నుంచి తొలగించాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది. రాబోయే ఎన్నికల డ్యూటీలతో పాటు అన్ని రకాల పోలీసు విధులనుంచి ఆమెను తప్పించాలని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నిర్ణీత గడువులోగా సమగ్ర విచారణ జరిపి, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పరిశీలించి నివేదిక అందించాలని సూచించింది..