తిరుపతి అలిపిరి పరిసరాల్లో ఫుట్‌పాత్‌ ఆక్రమణ తొలగింపు..!

ఫుట్‌పాత్‌లు. రోడ్లపై అనధికారికంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్స్, దుకాణాలు తొలగింపు.

తిరుపతి అలిపిరి పరిసరాల్లో ఫుట్‌పాత్‌లు మరియు రోడ్లపై అనధికారికంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్స్, దుకాణాలను మున్సిపల్ మరియు పోలీస్ అధికారులు తొలగిస్తున్నారు. అలిపిరి వద్ద భక్తులు, వాహనదారులకు తీవ్ర అంతరాయం కలగడంతో ఈ ఆకస్మిక తొలగింపు చర్యలు చేపట్టారు.నిబంధనలు ఉల్లంఘిస్తూ నడిచే రోడ్డు పక్కన దుకాణాలపై ట్రాఫిక్ పోలీసులు, నగర పాలక సంస్థ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆక్రమణల పునరావృతం కాకుండా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.