Letest news… నేటి ప్రధాన వార్తలు..

వెంటనే టెహ్రాన్ ఖాళీ చేయండి: ట్రంప్.

ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రజలంతా ఆ నగరాన్ని ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ‘ఇరాన్ డీల్ మీద సంతకం చేసుండాల్సింది. వారిని నేను సంతకం చేయమని చెప్పాను. ఎంత సిగ్గుచేటు, ఎంతమంది ప్రాణాలను తీస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను దక్కించుకోలేదని చాలా క్లియర్గా పదే పదే చెప్పాను. టెహ్రాన్లో ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే ఆ నగరాన్ని ఖాళీ చేయండి’ అని ట్రూత్తో పోస్ట్ చేశారు..

యుద్ధంలోకి అమెరికా?.

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో యూఎస్ యుద్ధవిమానాలు మిడిల్ ఈస్ట్ వైపుగా వచ్చాయని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇజ్రాయెలు US మద్దతిచ్చే అవకాశముంది. తాజాగా ట్రంప్ చేసిన ప్రకటన ఈ ప్రచారానికి మరింత బలాన్నిస్తోంది. నిన్న దాడుల్లో ఇజ్రాయెల్లోని అమెరికా ఎంబసీ ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాన్కు యెమెన్ మద్దతు ప్రకటించింది..

కెనడా చేరుకున్న ప్రధాని మోదీ

G7 సమ్మిట్కు హాజరయ్యేందుకు బయలుదేరిన ప్రధాని మోదీ కెనడాలోని కాల్గరీలో ల్యాండ్ అయ్యారు. ఆ దేశ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు..కననాస్కీస్లో జరుగుతున్న 51వ సమ్మిట్లో G7…దేశాల లీడర్స్తో మోదీ భేటీ కానున్నారు. ఆయా..దేశాలతో దౌత్య సంబంధాలు, ట్రేడ్ తదితర అంశాలపై చర్చించనున్నారు..

మోదీని చంపేయాలంటూ నినాదాలు

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా కెనడా చేరుకున్న నేపథ్యంలో అక్కడి ఖలిస్థానీ అనుకూల గ్రూప్స్ ఆందోళన చేపట్టాయి. కాల్గరీలో భారీగా వాహనాలతో ర్యాలీ నిర్వహించి, మోదీని చంపేయాలని నినాదాలు చేశారు. కొందరు నిరసనకారులు మోదీ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల వెనుక ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మద్దతు ఇచ్చిన సంస్థ ఉందని తెలుస్తోంది..

మూడేళ్లలో మెడికల్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు: రేవంత్

TG: రాష్ట్రంలోని 34 మెడికల్ కాలేజీల్లో మూడేళ్లలో అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఖాళీల భర్తీకి సమగ్ర నివేదికను రూపొందించి అందించాలన్నారు. ప్రభుత్వం తరఫున అవసరమైన నిధులు వెంటనే విడుదల చేస్తామని తెలిపారు. మరోవైపు జపాన్లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని, నర్సింగ్ కాలేజీల్లో జపనీస్ లాంగ్వేజ్ ఆప్షనల్గా నేర్పించాలన్నారు..

మా ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే కుట్ర‌: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఓ కుటుంబం(కేసీఆర్‌) కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌దోసి తాము అధికారంలోకి వ‌చ్చేందుకు ఆది నుంచి కుట్ర‌లు ప‌న్నింద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఎప్పటిక‌ప్పుడు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో తాము ఆ కుట్ర‌ల‌ను ఛేదిస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని చూసి ఆ కుటుంబం జీర్ణించుకోలేక పోతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. అందుకే.. ప్ర‌తి చిన్న విష‌యాన్నీరాజ‌కీయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తుంటే.. దానిపైనా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

తాజాగా ‘రైతు నేస్తం’ కార్య‌క్ర‌మాన్ని రంగారెడ్డి జిల్లా రాజేంద్రగనర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాము గ‌ద్దె నెక్కిన ఆరు మాసాల్లోనే రైతుల‌కు రుణ మాఫీ చేశామ‌న్నారు. సుమారు ల‌క్ష కోట్ల‌కు పైగా సొమ్మును రైతుల‌కు రుణ మాఫీ రూపంలో అందించామ‌ని చెప్పారు. గ‌త పాల‌కులు ప‌దేళ్ల‌లో చేయ‌లేని ప‌నిని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేవ‌లం ఆరు మాసాల్లోనే చేసి చూపింద‌ని.. దీంతో వారి క‌డుపు మంట మ‌రింత పెరుగుతోంద‌ని ఎద్దేవా చేశారు. త‌మ ప్ర‌భుత్వాన్నికూల్చేసేందుకు కుట్ర‌లు ప‌న్నుతూనే ఉన్నార‌ని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో శ‌వ రాజ‌కీయాలుచేస్తున్నార‌ని బీఆర్ ఎస్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎవ‌రు ఏ విధంగా చ‌నిపోయినా.. దానిని తమ ప్ర‌భుత్వానికి అంట‌గ‌డుతున్నార‌ని రేవంత్ రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. అయినా.. త‌మ ప్ర‌భుత్వం ఎవ‌రినీ చ‌నిపోవాల‌ని కోరుకోద న్నారు. రైతుల‌కు సాధ్య‌మైనంత మేలు చేస్తున్నామ‌ని చెప్పారు. స‌ర్పంచులను గ‌త ప్ర‌భుత్వం ఏడిపించింద‌ని.. పోలీసుల‌తో కేసులు పెట్టించింద‌ని పేర్కొన్నారు. “గత సీఎం అందినకాడికల్లా అప్పులు చేసి రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చారు. రిటైర్‌ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్‌ చెల్లించలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. మేం వ‌చ్చాక వాటిని స‌రిచేస్తున్నాం. ఇప్పుడు నెల నెలా జీతాల‌ను టైం ప్ర‌కారం ఇస్తున్నాం” అని తెలిపారు.

ఫోన్‌ట్యాపింగ్ విష‌యంపై స్పందిస్తూ.. గ‌తంలో ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు ఫోన్లు మాట్లాడుకున్నా.. భ‌య‌ప‌డే ప‌రిస్థితికి తీసుకువ‌చ్చార ని సీఎం రేవంత్ అన్నారు. చివ‌ర‌కు ప‌డ‌క గ‌దిలో కూడా ఫోన్లు మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా చేశార‌ని అన్నారు. ” అప్ప‌ట్లో ఫోన్‌ ట్యాపింగ్‌తో అరాచకం చేశారు. భార్యాభర్తలు కూడా ఫోన్‌లో స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితి క‌ల్పించారు. ఇప్పుడు అన్నీ నంగ‌నాచి క‌బుర్లు చెబుతున్నారు. విచార‌ణ‌కు పిలిస్తే.. అరెస్టు చేసి జైల్లో పెడ‌తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇవ‌న్నీ.. ప్ర‌జ‌లు చూసే వారికి త‌గిన విదంగా బుద్ధి చెప్పారు.” అని రేవంత్ వ్యాఖ్యానించారు..

తెలంగాణలో LRS గడువును మరోసారి పెంచిన ప్రభుత్వం..

25 శాతం రాయితీతో ఈనెల 30 వరకు గడువు..తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు ఇప్పటివరకు 7 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లింపు ఇప్పటివరకు ప్రభుత్వానికి రూ.2 వేల ఆదాయం..LRSలతో మొత్తం రూ.10 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం..

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం.. జీ7 ట్రిప్‌ నుంచి ఆగమేఘాలపై అమెరికాకు ట్రంప్‌..!.

ఇక కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సులో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. హుటాహుటిన అమెరికాకు పయనం అయ్యారు. అత్యవసరంగా భద్రతా మండలి సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. వచ్చీరాగానే భద్రతా మండలి సమావేశంలో పాల్గొననున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి….జీ7 సదస్సులో ట్రంప్ చర్చలు జరిపారని.. యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు లీవట్ వెల్లడించారు. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ట్రంప్ అర్ధంతరంగా పర్యటన ముగించుకుని అమెరికాకు బయల్దేరినట్లు లీవిట్ పేర్కొన్నారు. ఇక ట్రంప్ కూడా జీ7 సభ్య దేశాల నేతలతో గ్రూప్‌ ఫొటో దిగిన తర్వాత అత్యవసరంగా తిరిగి వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ స్పందిస్తూ.. ట్రంప్‌ వెనుదిరగడం సరైన నిర్ణయమే అని అన్నారు. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధాన్ని ముగించాలని జీ7 నేతలు పిలుపునిచ్చారు..ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెహ్రాన్ ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికైనా ఇరాన్‌కు సమయం మించిపోలేదని.. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. కెనడా వేదికగా జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందాన్ని అంగీకరించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యనించారు. మరింత సమయం ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని.. ఇప్పటికే రెండో అవకాశం ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ట్రంప్ గుర్తుచేశారు..

రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు .. కేటీఆర్.

కొనసాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. పాలన చేతగాని రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలపై అక్రమ కేసులు పెట్టి, వేధించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ”మొన్న ఆయన్ను హౌలా అన్నందుకు మండిపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా జై తెలంగాణ అననోడ్ని ఏమనాలె?” అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘రాష్ట్రం దివాలా తీసిందంటడు. ఢిల్లీలో దొంగలా చూస్తున్నారంటడు. అప్పు పుట్టడం లేదంటడు. ఇలాంటోడ్ని ఏమనాల్నో మీరే చెప్పండి’ అని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఏసీబీ విచారణకు హాజరైన అనంతరం సోమవారం సాయంత్రం కేటీఆర్‌ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రతిష్ఠను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లే పనిచేశానని, తలదించుకునేలా తాను ఎలాంటి తప్పూ చేయలేదని కేటీఆర్‌ చెప్పారు. లుచ్చా పనిచేసి నెలరోజులు జైల్లో ఉన్న రేవంత్‌కు ప్రతిపక్ష నేతలను కూడా కొన్నిరోజులు జైల్లో పెట్టాలని ఒక షోకు ఉందని.. అందుకే తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్‌ను, మాజీ మంత్రి హరీశ్‌ను కాళేశ్వరం కమిషన్‌ విచారణకు రప్పించారని ఆరోపించారు.

ఆయనలాగా లుచ్చా పనిచేసి రూ.50 లక్షలతో పట్టుబడిన వారు తమ పార్టీలో ఎవరూ లేరన్నారు. ‘నాకు దక్కనిది ఎవరికీ దక్కొద్దు.. నాకు జరిగింది నీకూ జరగాలి’ అన్నట్లుగా సీఎం శాడిస్టులా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ‘జైల్లో పెడితే పెట్టనీ. 15 రోజులు జెలుకెళ్తే ఏమైతది. కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకుంట. ఈ ఉడత ఊపులకు భయపడేది లేదు’ అని కేటీఆర్‌ అన్నారు. నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మంది ముందు ఫార్ములా-ఈ రేసు గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే రేవంత్‌రెడ్డి పారిపోయారని చెప్పారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు సాహసించని లై డిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమని తానంటే.. రావడానికి ఈ సీఎంకు ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. మొదటి సంవత్సరం ఫార్ములా-ఈ రేసు విజయవంతం కావడంతో రెండో ఏడాది కూడా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగానే నిర్వహణ సంస్థకు డబ్బులు పంపిన విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించానని కేటీఆర్‌ తెలిపారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉందని తాను అధికారులను ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేకపోయారన్నారు. చిట్టినాయుడు రాసిచ్చిన పనికిమాలిన ప్రశ్నలనే ఏసీబీ అధికారులు పొద్దుట్నుంచీ అటుతిప్పి, ఇటుతిప్పి అడిగారని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వ పెద్దల నుంచి అరెస్ట్‌ చేయాలని ఒత్తిడి ఉంటే చేసుకోమని అధికారులకు చెప్పానన్నారు. రేవంత్‌రెడ్డి ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి అని, వాళ్లు తనపై పెడుతున్న కేసులన్నీ లొట్టపీసు కేసులేనని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దద్దమ్మ రాజకీయాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ధైర్యంగా ఎదుర్కొందామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఫుట్‌బాల్‌ ఆడుకుందామని, ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించి సత్తా చాటుకుందామని పిలుపునిచ్చారు. ఈ నెల 21కి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఆరేళ్లవుతోందని, ఈ సందర్భంగా కాళేశ్వరం గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేద్దామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ తరఫున కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు….

నియోజకవర్గాల పునర్విభజనకు లైన్‌క్లియర్‌!!?

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది…దేశంలో జన గణన చేపట్టడానికి అనుమతిస్తూ సోమవారం కేంద్రం గెజిట్‌ నోటీఫికేషన్‌ జారీ చేసింది. జన గణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది.

రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల శాసన సభల్లో స్థానాల పెంపునకు లైన్‌ క్లియర్‌ కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014, మార్చి 1న ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014ను కేంద్రం జారీ చేసింది. దీంతో 2014, జూన్‌ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాజ్యాంగంలోని 170వ అధికరణలోని సెక్షన్‌-15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 134కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం-2014లో సెక్షన్‌-26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం 2019 నాటికే రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం, కేంద్రం పూర్తి చేస్తాయని రాజకీయపార్టీలు ఆశిస్తూ వచ్చాయి. కానీ.. ఆ ఆశలు అడియాసలయ్యాయి.

జన గణనతో ముడిపెట్టిన కేంద్రం
జమ్మూ కశ్మిర్‌లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2022, మే 5న కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ శాసనసభ స్థానాలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో కె.పురుషోత్తం రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ కోటీశ్వర్‌ సింగ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు కోరింది. దేశంలో జన గణన ప్రక్రియ 2026లో పూర్తవుతుందని.. ఆ తర్వాతే విభజన చట్టంలో సెక్షన్‌-26(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పెంపునకు నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేస్తూ అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌పై తీర్పును ఏప్రిల్‌ 30న సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం రిజర్వు చేసింది..

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు .. కేంద్రం ఇచ్చిన గెజిట్ తో క్లారిటీ..?.

ఇక తొలి విడత 2026 అక్టోబర్ 1న జనాభా లెక్కింపు మొదలుకానుంది .. ఇక 2027 మార్చ్ ఒకటికి పూర్తి చేయనున్నారు . అయితే మొదటి దశలో మంచు ఎక్కువగా ఉండే కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ , లద్దాఖ్‌ తో పాటు హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్లో ఈ జన గణన జరగనుంది. ఇక రెండో దశలో మిగిలిన రాష్ట్రాల్లో 2027 మార్చ్ ఒకటి నుంచి మొదలు పెడతారు .. అయితే రెండో జనగణతో పాటు కులగణన కూడా చేపట్టనున్నారు .. ఇక ఇందుకోసం భారీ మొత్తంలో ఉద్యోగుల్ని కూడా తీసుకుంటున్నారు .. అయితే ఈ జనగణన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 8వ సారి జరుగుతుంది .. అంతకుముందు 8 సార్లు చేపట్టినట్టు కేంద్ర హోమ్ శాఖ తెలిపింది ..

అయితే నిజానికి 2021 లోనే జనగణన జరగాల్సి ఉండగా .. ఆ సమయంలో కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది .. ఇక చివరిగా 2011లో జనాభా లెక్కంపు జరిగింది .. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కించాల్సి ఉంటుంది .. కానీ దేశంలో కోవిడ్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే .. ఇక ఇప్పుడు మళ్లీ జనాభా లెక్కింపు చేయనున్నారు .. అయితే ఈసారి దేశవ్యాప్తంగా లోక్సభ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు ఈ జనగణన తోడ్పడునుంది..

భూకంపంతో కకావికలమైన వేళ అందరికంటే ముందుగా స్పందించి అన్నివిధాలైన సాయం పంపి ఆదుకున్న భారత్‌ పట్ల సిందూర్‌ వేళ తుర్కియే అక్షరాలా విషం కక్కింది. పాకిస్తాన్‌కు డ్రోన్లతో పాటు అన్నివిధాలా సాయుధ సాయం చేసి మనపట్ల కృతఘ్నత ప్రదర్శించింది.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తన తొలి విదేశీ పర్యటనకు అనూహ్యంగా సైప్రస్‌ను ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇది యాదృచ్చికమేమీ కాదని విదేశాంగ నిపుణులు అంటున్నారు. ఈ చర్య ద్వారా తుర్కియేకు గట్టి సందేశమే ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. ఆదివారం మోదీ సైప్రస్‌లో పర్యటించారు. ఒక భారత ప్రధాని ఆ దేశానికి వెళ్లడం 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

ఈ ఎంపిక వెనక పలు భౌగోళిక, రాజకీయ ప్రాథమ్యాలు దాగున్నాయి. సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలిడెస్‌ ఆహ్వానం మేరకు మోదీ ఈ యాత్ర చేపట్టారు. అంతేగాక విమానాశ్రయంలో మోదీని ఆయన స్వయంగా స్వాగతించారు. సైప్రస్‌ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. తద్వారా భారత్‌తో మైత్రీ బంధానికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. మోదీ ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరపడమే గాక వ్యాపార దిగ్గజాల సదస్సులో కూడా పాల్గొన్నారు. ప్రధాని సైప్రస్‌ యాత్రకు పలు రకాలుగా ప్రాధాన్యముంది.

ఉగ్రపోరులో దన్ను.

కశ్మీర్‌ విషయంలో తుర్కియే తొలి నుంచీ పాక్‌కు మద్దతిస్తూ వస్తోంది. ఇక ఇరుదేశాల మధ్య ఘర్షణలు తలెత్తితే తను ఎటువైపో సిందూర్‌ వేళ కుండబద్దలు కొట్టింది. ఉగ్రవాదం పట్ల కూడా దానిది తొలినుంచీ మెతక వైఖరే. కానీ సైప్రస్‌ అలా కాదు. కశ్మీర్‌ విషయంలో ఎప్పుడూ భారత్‌కు మద్దతుగా ఉంటూ వస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించాల్సిందేనన్న మన వైఖరికి మొదటినుంచీ పూర్తిగా దన్నుగా నిలిచింది.

పహల్గాం ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించింది. అంతేగాక పాక్‌ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని యూరోపియన్‌ యూనియన్‌ వేదికపై ఎండగడతానని హమీ ఇచ్చింది. ఈ విషయమై ఈయూ దేశాల నుంచి మనకు మద్దతు కూడగట్టింది. 2026లో ఈయూ సారథ్య బాధ్యతలు కూడా చేపట్టనుంది.

ఈ నేపథ్యంలో సైప్రస్‌ మద్దతు భారత్‌కు చాలా కీలకం. అంతేగాక ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతోంది. భారత్‌-అమెరికా పౌర అణు ఒప్పందానికి కూడా మద్దతుదారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌కు సైప్రస్‌ పూర్తిగా నమ్మదగ్గ మిత్రుడని విదేశాంగ శాఖ పేర్కొనడంలో అంతరార్థం కూడా అదే. పహల్గాం నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు తోడు నిలిచిన మిత్ర దేశాలకు కృతజ్ఞత తెలిపేందుకు తాజా మూడు దేశాల పర్యటన చక్కని అవకాశమని మోదీ ప్రకటించారు కూడా.

తుర్కియేతో వైరం..

వీటికి తోడు తుర్కియేతో సైప్రస్‌కు నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాటి నడుమ విభేదాలు ఈనాటివి కావు. సైప్రస్‌ను ఆక్రమించాలని గ్రీస్‌ ఎప్పటినుంచో ప్రయతి్నస్తోంది. 1974లో అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రకు గ్రీస్‌ పూర్తిగా సహకరించింది. అదే అదనుగా తుర్కియే మరోవైపు నుంచి సైప్రస్‌పై దండెత్తింది. నాడు ఆక్రమించిన భూభాగాల నుంచి నేటికీ వైదొలగలేదు.

వర్తక పరంగానూ...

అంతేగాక మోదీ పర్యటన సందర్భంలో వర్తక, ఇంధన తదితర రంగాల్లో భారత్‌తో సైప్రస్‌ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనికి తోడు భారత్‌-పశ్చిమాసియా-యూరప్‌ ఆర్థిక కారిడార్‌లో భౌగోళికంగా సైప్రస్‌ అత్యంత వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఆ దేశంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన యూరో బ్యాంక్‌ ముంబైలో ప్రాతినిధ్య కార్యాలయం ఏర్పాటు చేయనుంది. సానుకూల పన్నుల వ్యవస్థ, అద్భుతమైన ఆర్థిక సేవల రంగం, బాగా అభివృద్ధి చెందిన షిప్పింగ్‌ రంగం మనకు వర్తకపరంగా బాగా అనుకూలించే విషయాలు. తూర్పు మధ్యధరా ప్రాంతంలో సహజ వాయువు వెలికితీత ప్రాజెక్టుల్లో సైప్రస్‌ కీలక భాగస్వామి కూడా..