*✍🏼 నేటి కథ ✍🏼*
*చావును జయించే ఉపాయం*
చంద్రగిరి పరిపాలించే సత్యవర్మకి మరణాన్ని జయించాలనే కోరిక కలిగింది . మంత్రిని రప్పించి తన కోరిక బయటపెట్టాడు .
‘ప్రభు ! ఈ విశ్వంలో చనిపోనిదంటూ ఏది ఉండదని చెబుతారు . పుట్టిన ప్రతి జీవికి గిట్టక తప్పదు , అయితే ఇక్కడికి వెయ్యి ఆమడాల దూరము లో దీపశిఖ అనే పురాతన కోటలో ఓ మంత్రసిద్ధుడు మరణాన్ని జయించాడని మా తాతగారు చెప్పేవారు ‘ అన్నాడు మంత్రి ‘
సత్యవర్మ అమితోత్సహంగా , ‘ అయితే నేనే స్వయంగా వెళ్లి ఆయన్ని కలుసుకుంటాను . నేను వచ్చే వరకు రాజ్యభారం మీదే ‘ అంటూ అప్పటికప్పుడే బయల్దేరాడు .
ఆరు నెలల పాటు ప్రయాణించిన రాజు సత్యవర్మ చివరికి ఎలాగైతేనేం , పురాతనమైన దీపశిఖ కోటను చేరుకున్నాడు.
శిధిలావస్థలో కూలిన గోడలతో పిచ్చి మొక్కలు పెరిగిపోయిన ఆ కోటలో తిరగసాగాడు .ఇంతలో సాలెగూల్లు దట్టంగా అల్లుకున్న ఓ గదినుంచి , ‘ఎవరు నువ్వు ?’ అనే మాటలు వినిపించాయి
‘నేను చంద్రగిరి మహారాజు ను , మృత్యుంజయుడిని వెదుకుతూ వచ్చాను ‘ అన్నాడు సత్యవర్మ
‘నువ్వు వెతుకున్నది నేనే ! నీ పిచ్చి ఆలోచన మానుకుని వెంటనే వచ్చిన దారినే వెళ్ళు ‘ అని గదిలోంచి వినిపించింది .
‘లేదు …. నేను మీలాగా మృత్యువును జయిస్తాను ‘
‘అయితే లోపలి రా ‘
రాజు సత్యవర్మ ఉత్సాహంగా లోపలికి వెళ్లి అక్కడే దృశ్యం చూసి నివ్వెరపోయాడు .
అక్కడొక వృద్ధుడు ధూళిలో పడుకొని ఉన్నాడు. అతడి జుట్టు గడ్డం చాలా దూరం పెరిగిపోయి ఉన్నాయి .గోళ్ళు మెలితిరిగిపోయి కనిపించాయి . అతడి శరీరం పూర్తిగా శుష్కించిపోయి చర్మం ఎముకలకు అతికించినట్టు ఉన్నది.
‘ప్రకృతి విరుద్ధమైన కోరికతో మంత్రోపాసన చేసి చావును జయించగాలిగాను కాని, శరీర సహజమైన ముసలితనాన్ని అడ్డుకోలేకపోయాను . కనీసం కదలడానికి కుడా ఓపిక లేని నా దుస్థితిని కావాలంటే నీకు కుడా మంత్రం ఉపదేసిస్తాతాను ‘ అన్నాడు మృత్యుంజయుడు .
రాజు సత్యవర్మ మారు మాట్లాడకుండా అక్కడ నుంచి బయల్దేరి తిరిగి కోటకు చేరుకున్నాడు .
సేకరణ:సొంటేల ధనుంజయ.