పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ఏడాది తర్వాత కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు…

పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ఏడాది తర్వాత కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, సురక్షితంగా ఉందని పర్యాటకులు అంటున్నారు..

Tourists say Kashmir has regained normalcy and feels safe year after Pahalgam terror attack.

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం రక్తపాతానికి నేటితో సరిగ్గా ఏడాది. గత ఏడాది ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు జరిపిన ఘాతుకంలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద జ్ఞాపకాలు నేటికీ పహల్గాం వీధుల్లో తడి ఆరని గాయాలుగానే మిగిలిపోయాయి. ఆ దాడి తర్వాత సుమారు 45 పర్యాటక కేంద్రాలను ప్రభుత్వం మూసివేయాల్సి వచ్చింది…
నేడు (ఏప్రిల్ 22) పహల్గాం స్మారక చిహ్నం వద్ద బాధిత కుటుంబాలు నివాళులర్పించాయి. మరోవైపు, ఉగ్రవాదులు మళ్ళీ దాడులకు తెగబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో లోయలో హైఅలర్ట్‌ ప్రకటించారు. స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ అణువణువూ గాలిస్తూ, సానుభూతిపరుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. దాల్‌ లేక్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భయం నీడలు ఉన్నప్పటికీ, వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు దాల్‌ లేక్ వద్దకు చేరుకుంటున్నారు….ఇదిలావుంటే ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించారు. అయితే మరణించిన వారి పేర్లతో బైసరణ్ లోయ సమీపంలో స్మారక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. దానిపై మరణించిన 26 మంది పర్యాటకుల పేర్లు, వారు ఏ రాష్ట్రం నుండి వచ్చారు అనే వివరాలను పొందుపరిచారు. ఈ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు, స్థానికులు నివాళులు అర్పిస్తున్నారు. ఏడాది క్రితం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి చేదు జ్ఞాపకాన్ని తుడిచివేస్తూ.. శాంతి, భద్రతలే లక్ష్యంగా అధికారులు ముందడుగు వేస్తున్నారు. దీంతో అక్కడ మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు..