సర్ మీద దేశమంతా కొట్లాడుతుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు మాట్లాడ్తలేరని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ప్రశ్నించారు. బీజేపీకి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారన్నారు. హరీశ్ రావు, కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ ఫార్ములా కేసులో అరెస్టు చేస్తారనే భయంతో సైలెంటయ్యారని ఎద్దేవా చేశారు. ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ వయసును లెక్క చేయకుండా కొట్లాడుతన్నారని కొనియాడారు. బీజేపీ మిత్ర పక్షాలు సైతం మౌనంగా ఉన్నాయన్నారు. గాంధీభవన్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై సూటి ప్రశ్నలు సంధించారు.
సర్ (SIR) ప్రక్రియ మీద దేశ వ్యాప్తంగా బీజేపీ, దాని మిత్ర పక్షాలు తప్ప అన్ని పార్టీలు రోడ్డెక్కాయి. మోదీ, అమిత్ షా రాజకీయ తీరుపై పోరాటం చేస్తుంటే తెలంగాణ బీఆర్ఎస్ పాత్ర ఎక్కడుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది. సీఈసీ తప్పిదం చేస్తుంటే హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిన పాపాన పోలేదు. బీఆర్ఎస్లో ఉలుకు, పలుకు లేదు. నిరసన కార్యక్రమం చేయలేదు. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఉంది. కాళేశ్వరంలో సీబీఐ అరెస్టు చేస్తదేమో అని భయం. ముషీరాబాద్లో ప్రింటెడ్ ఫామ్ మీద సంతకం పెడుతున్నారు. సర్లో దళితుల, మైనారిటీ, గిరిజనుల ఓట్లు తొలగిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో రోహింగ్యాల పేరుతో మమత బెనర్జీ గెలవకుండా ఆపారు. బీహార్లో ఆర్జేడీని గెలవకుండా ఆపారు.