తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగించబడ్డాయన్న వార్త అవాస్తవమని ఎస్ఈసీ తెలిపింది. 95 లక్షల ఓట్లు తొలగించబడ్డాయన్న వార్తలపై తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వివరణ ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏఎస్డీడీ (ASDD) కేటగిరీలో కేవలం 73,39,235 మంది ఓటర్లను మాత్రమే గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు 92,88,187 నోటీసులు జారీ చేశామని, 92,23,486 మంది ఓటర్లకు నోటీసులు అందగా, 64,701 నోటీసులు ఇంకా పంపిణీ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.ఇప్పటివరకు నోటీసులు అందుకున్న 8,21,205 మందిపై విచారణ పూర్తయిందని ఎస్ఈసీ తెలిపింది. తుది ఓటర్ల జాబితాలో చేర్చడానికి 7,46,2851 మంది అర్హులుగా తేలారని పేర్కొంది. కేవలం 12,969 మంది ఓటర్లు మాత్రమే అనర్హులుగా ఉన్నారని తెలిపింది. మరో 1,81,2,367 మంది ఓటర్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. మిగిలిన నోటీసులపై 2026 నవంబర్ 5వ తేదీలోగా నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడైంది. ఓటర్ల జాబితాకు సంబంధించిన వార్తలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి అన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.