Traffic Alert Hyd: Today.
మొహర్రం ఊరేగింపుతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.
* తెలంగాణలో మొహర్రం సందర్భంగా హైదరాబాద్‌లో బీబీ కా ఆలమ్ ఊరేగింపు నేపథ్యంలో.. జూన్ 26న పాతబస్తీలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా నేడు మధ్యాహ్నం 12:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు…
ట్రాఫిక్ అడ్వైజరీ ప్రకారం బీబీ-కా-అలావా వైపు వాహనాలకు అనుమతి లేదు. ఆ మార్గంలో వచ్చే వాహనాలను సునార్గల్లి టీ జంక్షన్ వద్ద దబీర్‌పురా దర్వాజా, గంగానగర్ నాలా, యాకుత్‌పురా వైపు మళ్లిస్తారు. షేక్ ఫైజ్ కమాన్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను జబ్బార్ హోటల్ వద్ద ఆపి దబీర్‌పురా దర్వాజా లేదా చంచల్‌గూడ వైపు పంపుతారు. ఎతేబార్ చౌక్ నుంచి బడా బజార్ వైపు రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. ఇక్కడికి వచ్చే వాహనాలను పరిస్థితిని బట్టి కోట్లా అలిజా లేదా పురానీ హవేలీ వైపు మళ్లించేలా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు…ప్రధాన ఊరేగింపు యాకుత్‌పురా గంగానగర్ నాలాకు చేరుకున్నప్పుడు పురానీ హవేలీ నుంచి ఎతేబార్ చౌక్‌కు వెళ్లే వాహనాలను ఛత్తా బజార్, దబీర్‌పురా, ఎస్జే రోటరీ వైపు మళ్లిస్తారు. మొఘల్‌పురా, వోల్టా హోటల్ నుంచి వచ్చే వాహనాలను బీబీ బజార్ ఎక్స్ రోడ్స్ వద్ద ప్యారిస్ కేఫ్ లేదా తలాబ్ కట్టా వైపు తిప్పుతారు. ఊరేగింపు ఎతేబార్ చౌక్ వద్దకు రాగానే మిట్టీ-కా-షేర్, మదీనా నుంచి వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి ఉండదు. అలాగే కోట్లా అలిజాకు చేరుకున్న సమయంలో మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ నుంచి చౌక్ మైదాన్ ఖాన్ వైపు వచ్చే వాహనాలను హఫీజ్ డంకా మసీదు వద్ద దారి మళ్లిస్తారు.