అమెరికా అధికారులను ఉటంకిస్తూ, ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అధ్యక్షుడు ట్రంప్ తన సహాయకులతో చెప్పినట్లు అమెరికా మీడియా నివేదిస్తోంది—హోర్ముజ్ జలసంధి దాదాపుగా మూసివేయబడి ఉన్నప్పటికీ..
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతోంది. తాజాగా.. ఇరాన్ అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్‌పై అమెరికా విరుచుకుపడింది. ఓ ప్రధాన ఆయుధ నిల్వల డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లకు సంబధించి ఓ వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున ఇస్ఫహాన్ నగరంలో చోటుచేసుకుంది.
ఈ వీడియోలో వరుస పేలుళ్లు సంభవించడం.. ఆ తర్వాత ఆకాశమంతా నారింజ రంగు మంటలతో నిండిపోవడం కనిపిస్తోంది. అయితే, ట్రంప్ ఈ వీడియోకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఇస్పహాన్లోని ఆయుధ నిల్వలు ఉన్న డిపోపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల దృశ్యాలేనని మీడియా నివేదికలు చెబుతున్నాయి. సుమారు 23 లక్షల జనాభా కలిగిన ఇస్ఫహాన్ నగరంలో ‘బదర్’ సైనిక విమానశ్రయం కూడా ఉంది.