భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మోదీ చాలా గొప్ప వ్యక్తి అని, తనకు మంచి స్నేహితుడని చెప్పారు. వచ్చే ఏడాది భారత్ పర్యటకు వెళ్తానన్నారు. భారత్తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయన్న ట్రంప్.. ఇరు దేశాల చర్చలు త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు. భారతదేశం రష్యా నుండి కొనుగోలు చేయడం దాదాపుగా ఆపివేసిందని తెలిపారు..బరువు తగ్గించే ఔషధాల ధరలు తగ్గించేందుకు కొత్త ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత వైట్ హౌస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీతో నా చర్చలు అద్భుతంగా సాగుతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను మోదీ క్రమంగా తగ్గిస్తున్నారు. ఆయన నా స్నేహితుడు. మేము మాట్లాడుకుంటున్నాము. ఆయన నన్ను భారత్కు రావాలని కోరుతున్నారు. దాన్ని పరిశీలిస్తాము.. నేను వెళ్తాను’’ అని ట్రంప్ అన్నారు. వచ్చే సంవత్సరం భారత్కు వెళ్తారా? అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ ‘‘ఆ అవకాశం ఉంది’’ అని సమాధానమిచ్చారు.
ట్రంప్ ఈ ఏడాది జరిగే క్వాడ్ సమ్మిట్ కోసం భారత్ రావాల్సి ఉండగా.. ఇండియాపై అమెరికా భారీ సుంకాలు విధించిన తర్వాత ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆగస్టులో పేర్కొంది..
నోబెల్ ప్రైజ్ అండ్ ఎ టెస్టీ ఫోన్ కాల్: హౌ ది ట్రంప్-మోదీ రిలేషన్షిప్ అన్రావెల్డ్’’ అనే శీర్షికతో వచ్చిన ఆ కథనం ప్రకారం.. ట్రంప్ తొలుత సమ్మిట్కు హాజరవుతానని మోదీకి హామీ ఇచ్చినా, ఆ ప్రణాళిక తర్వాత రద్దు అయ్యింది.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను కొనసాగించడంతో అమెరికా 50 శాతం సుంకం, అదనంగా 25 శాతం పన్నులు విధించడంతో దీనిపై రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది భారతదేశానికి వెళ్లవచ్చని చెప్పారు మరియు భారతదేశంతో చర్చలు “బాగా జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు. “ఇది చాలా బాగుంది, బాగా జరుగుతోంది. ఆయన (ప్రధానమంత్రి నరేంద్ర మోడీ) ఆగిపోయారు… ఎక్కువగా ఆయన రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం మానేశారు” అని ట్రంప్ ఓవల్ కార్యాలయంలో ప్రధాని మోడీతో చర్చలు మరియు భారతదేశంతో వాణిజ్య చర్చలు ఎలా పురోగమిస్తున్నాయనే ప్రశ్నకు సమాధానంగా అన్నారు
ట్రంప్ భారత్తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నారని అమెరికా అధికారులు తెలిపారు. ‘‘భారత్-అమెరికా సత్సంబంధాలను కొనసాగించడంపై ట్రంప్ సానుకూలంగా ఉన్నారు. కొన్ని వారాల క్రితం ఆయన ఓవల్ ఆఫీస్లో అనేకమంది ఇండియన్-అమెరికన్ అధికారులతో దీపావళి జరుపుకున్నారు. ఆ సందర్భంలో ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడారు’’ అని అన్నారు.
ఇటీవలి ఆసియా పర్యటనలోనూ ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు గణనీయంగా తగ్గించింది’’ అని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గిస్తామని లేదా నిలిపేస్తామని మోదీ హామీ ఇచ్చారని చెప్పారు..