హైదరాబాద్‌లో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

హైదరాబాద్‌లో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఆరాంఘర్‌ చౌరస్తా సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి ఢీకొట్టిన డీసీఎం

స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

ఇదిలా ఉండగా. రాష్ట్ర మొత్తాన్ని కుదిపేసిన.చేవెళ్ల బస్సు ప్రమాద క్షతగాత్రులకు ఇంత వరకు అందని నష్టపరిహారం

రాజకీయ నాయకులు, అధికారులు వచ్చి పరామర్శించి వెళ్లిపోయారు కానీ పరిహారం ఇవ్వలేదని క్షతగాత్రుల కుటుంబ సభ్యుల ఆరోపణలు

చేవెళ్ల బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

క్షతగాత్రులందరికి ఉచిత వైద్యం అందిస్తామని, రూ.2.5 లక్షల నష్ట పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అది అమలు కావడం లేదని ఆరోపిస్తున్న కుటుంబసభ్యులు

ఇన్ని రోజులుగా ఆసుపత్రి బిల్లు, ఖర్చులకు అవసరమైన డబ్బులు తామే చెల్లిస్తున్నామని చెబుతున్న క్షతగాత్రుల బంధువులు

అధికార పార్టీకి చెందిన నాయకులు రెండు రోజులు వచ్చి, పరామర్శ పేరుతో హడావిడి చేసి వెళ్లిపోయారని, తర్వాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు..