*🔹తెలంగాణ ఆర్టీసీ సమ్మె వాయిదా*
*• మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం.*
_• ఈ మేరకు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు JAC నాయకులు ప్రకటించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తాజాగా ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించి, తగిన పరిష్కార మార్గాలను సూచించనుంది. ఈ చర్చల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాలు, పని పరిస్థితులు, పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సానుకూల స్పందనతో ముందడుగు వేయడంతో సమ్మెను వాయిదా వేయాలని JAC నిర్ణయించింది.