కరీంనగర్ జిల్లా కేంద్రంగా స్వల్పంగా కంపించిన భూమి…
రిక్టర్ స్కెల్ పై 3.9 తీవ్రత నమోదు…
*🔹జగిత్యాలలో కంపించిన భూమి.*
_• ఆందోళనకు గురై ఇండ్ల నుండి బయటకు పరుగులు తీసిన ప్రజలు._
_• భూకంపం తో పాటు ఏదో శబ్దం కూడా వినపడినట్టు తెలిపిన స్థానికులు._
తెలంగాణలో మరోసారి భూమి కంపించింది. కరీంనగర్ జిల్లాలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కొన్నిసెకన్లపాటు భూ ప్రకంపనలు సంభవించాయి. రెక్టర్ స్కేలుపై 3.8తీవ్రతగ నమోదు అయ్యినట్లు సమాచారం. చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కంపించింది. భూమి కంపించడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలో ఉన్నవారు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో గోడలు, కిటికీలు స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు.