తుక్కుగూడ నర్సు హత్య ఘటనపై మెజిస్టీరియల్ విచారణ.
హైదరాబాద్: తుక్కుగూడలో నర్సు హత్య ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై సమగ్రంగా మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
హాస్టల్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని సీఎం సూచించారు. భద్రత విషయంలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా అన్నది గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నర్సు హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేసి, వీలైనంత త్వరగా చార్జిషీట్ దాఖలు చేయాలని సీఎం పోలీసు అధికారులను ఆదేశించారు. కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా విచారించి బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోందని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు