వైన్స్ మామూళ్ల పంచాయతీ..మోత్కూర్ లో వైన్స్ షాపుపై కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం.. *షాపును మూసేసి తాళాలు వేసుకుని వెళ్లిపోయిన వైనం.. *పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లకు వైన్ షాప్ నిర్వాహకులు ఫిర్యాదు..

*వైన్స్ మామూళ్ల పంచాది..
*మోత్కూర్ లో వైన్స్ షాపుపై కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం..
*షాపును మూసేసి తాళాలు వేసుకుని వెళ్లిపోయిన వైనం..
*పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లకు వైన్ షాప్ నిర్వాహకులు ఫిర్యాదు.
.

వైన్స్ వ్యాపారుల నుంచి ఎమ్మెల్యే మామూళ్ల వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని నార్కట్ పల్లి రోడ్డులో ఉన్న వైన్స్ షాపును మంగళవారం కాంగ్రెస్ నాయకులు మూసేసి తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. మద్యం వ్యాపారులు ఎమ్మెల్యే ఇంట్లో ఆయనతో మాట్లాడుతున్న సమయంలో ఆ వైన్స్ షాపులో పార్ట్నర్ గా ఉన్న ఓ వ్యక్తే రహస్యంగా వీడియో తీశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ నిర్వాహకులతో గొడవకు దిగారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా ఆ వైన్ షాప్ పై దాడి చేసి సిబ్బందిని బయటకు పంపి తాళం వేసుకుని వెళ్లిపోవడంతో ఈ మామూళ్ల వ్యవహారం కాస్త మరింత హాట్ టాపిక్ గా మారింది. వైన్ షాప్ నిర్వాహకులు స్థానిక పోలీసులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కాగా ఈ మామూళ్ల వ్యవహారంలో తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక, దళిత ఎమ్మెల్యే అయినందునే కొందరు వ్యక్తులు తనపై ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని వివరణ ఇచ్చారు…