కాకినాడ జిల్లా తునిలో మనవరాలి వయసున్న ఓ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు తాటిక నారాయణరావు (62) ఆత్మహత్య చేసుకున్నాడు. బాలికపై అత్యాచారం ఘటన కేసులో అతడిని అరెస్టు చేసిన పోలీసులు గత అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తున్న సమయంలో నారాయణరావు బహిర్భూమికి వెళ్తానని చెప్పాడు…దీంతో తుని పట్టణ శివారులోని కోమటిచెరువు పక్కన పోలీసులు వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో నారాయణరావు చెరువులో దూకాడని పోలీసులు చెప్పారు. చెరువులో గల్లంతైన నారాయణరావు ఆచూకీ కోసం పోలీసులు గజ ఈతగాళ్ల సాయం తీసుకున్నారు. ఇవాళ ఉదయం నారాయణరావు మృతదేహం లభ్యమైంది…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.