ఎన్నో అద్భుత ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్న ఉలవలను రోజూ తింటే చాలా మంచిది. ఉలవలు నవధాన్యాలలో ఒకటి. ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఈ ఉలవలను పేదవారు మాత్రమే గుగ్గిళ్లుగానో లేదా చారుగానో చేసుకుని తినేవారు. అయితే దేశ వ్యాప్తంగా ఇప్పుడు తినే ఆహారపదార్ధాల్లో ఒకటిగా మారింది..
ఈరోజు మనము ఉలువలు గురించి తెలుసుకుందాం…
ఆయుర్వేద వైద్య అనుభవజ్ఞుడు షేక్ బాహర్ అలీ .. సలహాలు,, సూచనలు…

ఉలువలను
సంస్కృతంలో :కులుద్ధ అంటారు.
హిందీలో: కులధీ
తెలుగులో :ఉలవలు
లాటిన్ :డాలికాస్ బైప్లోరస్ లైన్నేయిస్
కుటుంబం. :Fabace
అంటారు.
భారత దేశంలో ఉలవలు పండిస్తారు ఉలవలు చాలా బలవర్ధకమైన ఆహారం. తెలుగువారికి ఉలవచారంటే చాలా ఇష్టం. ఉలువలు తీసుకుంటే శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఉలవలు. కషాయరసం,ఉష్ణవీర్యం, లగురుక్ష,గుణములు మరియు కటు విపాకమును కలిగి ఉంటాయి. ఉలవలు వాతా హారం, మేధో హరము,శుక్ర హరము,విదా హికరం స్వేద సంగ్రాహ కర్మలను కలిగి ఉన్నాయి. మూత్రంలో రాళ్లు ఆస్తమా,దగ్గు, క్రిములు, జబ్బులు మరియు జలుబు వెక్కిళ్లు అనేక రోగాల్లో విరివిగా ఉపయోగిస్తారు.
దీనిలో ఐరన్,నికోటినిక్, కెరోటిన్,మినరల్స్,కార్బైడ్రేట్స్, కాల్షియం,ఫాస్ఫరస్,ప్రోటీన్లు, కొవ్వు,తేమ ఉన్నాయి
ఉలవలు సేవించినచో జరిగే ప్రయోజనాల గురించి చెప్పుకుందాం.
1. ఉలవల కషాయం సేవించిన మూత్రపిండాల్లో రాళ్లు తగ్గుతాయి ఉలవలు మరియు వరుణ లను కలిపి సేవించిన ప్రొస్ట్రేట్ గ్రంధి వాపు నందు హితంగా ఉండును.
2. ఉలవల కషాయము దోసకాయ రసం మరియు కొబ్బరినీళ్లు కలుపి త్రాగిన మూత్రం సాఫీగా అవుతుంది. మూత్రంలో మంట తగ్గుతుంది.వాపు తగ్గుతుంది గుండెజబ్బు వలన వచ్చే వాపుల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది
3. ఉలవ ఆకులు మరియు పసుపు కలిపి గడ్డలు మరియు పుళ్ళు ఉన్న భాగంలో రాసిన గడ్డలు పుండ్లు తగ్గుతాయి
4. ఉలవల ఆకులు ఆపిల్ జ్యూస్ మరియు కొద్దిగా పండిన అరటిపండు కలిపి తినిపించిన అతిసారము జిగురు విరోచనాలను తగ్గుతాయి.