యూపీలో చెట్టుపై కూర్చుని రూ.2 లక్షల కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరేసిన కోతి..!

*యూపీలో చెట్టుపై కూర్చుని రూ.2 లక్షల కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరేసిన కోతి*

ఉత్తరప్రదేశ్లోని బులంద్హర్లో ఒక కోతి చెట్టుపై కూర్చుని ఏకంగా రూ.2 లక్షల కరెన్సీ నోట్లను కిందికి చల్లింది. …

ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఒక న్యాయవాది బ్యాగ్ను లాక్కున్న ఆ కోతి, చెట్టెక్కి అందులోని నోట్లను గాల్లోకి విసిరేసింది.

దీంతో ఆ నోట్లను ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. కాసేపటి తర్వాత కోతి ఆ బ్యాగ్ను వదిలేసి వెళ్లిపోయింది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది….