ఉస్మాన్ ఖవాజా ఆటోబయోగ్రఫీ..కొత్త పుస్తకంలో వివాదాస్పద శాండ్‌పేపర్‌గేట్ వివరాలపై పాట్ కమిన్స్‌..!

ఉస్మాన్ ఖవాజా ఆటోబయోగ్రఫీ:
2018 కేప్టెన్ టౌన్ టెస్టులో కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్‌ను సాండ్‌పేపర్‌తో రుద్దుతూ కెమెరాకు చిక్కిన ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ notorious బాల్-ట్యాంపరింగ్ ఘటనలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రమైన శిక్షలు విధించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ప్రచురించనున్న ‘సబ్ర్’ (Sabr) ఆటోబయోగ్రఫీలో ఈ ఘటనకు సంబంధించిన అసలు విషయాలు బయటకు రావచ్చునని భావిస్తున్నారు.

మేము ఆ రోజులను ఎప్పుడో దాటేశాం: కమిన్స్
ఈ ఆటోబయోగ్రఫీ, అందులో రాబోయే కొత్త విషయాలపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (Pat Cummins) స్పందించారు. ప్రీ-మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో కమ్మిన్స్ మాట్లాడుతూ.. ఉజ్ (ఉస్మాన్ ఖవాజా) కొన్ని వారాల క్రితం నాకు ఫోన్ చేసి తను పుస్తకం రాస్తున్నట్లు చెప్పాడు. అప్పట్లోనే అన్ని విచారణలు పూర్తయ్యాయి. ఆ ఘటనపై నేను గతంలో మిలియన్ సార్లు సమాధానం ఇచ్చాను.. అది ఎప్పుడో ముగిసిన అధ్యాయం అని పేర్కొన్నారు. ఒక జట్టుగా మేమందరం ఆ రోజులను ఎప్పుడో దాటేశాం.. గత 8-9 సంవత్సరాలుగా మా జట్టు ఎంతో పరిణతి సాధించింది. ప్రస్తుతం నా పూర్తి దృష్టి టెస్టు జట్టుకు విజయాలు అందించడంపైనే ఉందని కమ్మిన్స్ స్పష్టం చేశారు…

శాండ్‌పేపర్‌గేట్ ఎందుకు మళ్లీ వార్తల్లోకి వచ్చింది?
ఈ వారం రెండు విషయాలు ఒకేసారి జరిగాయి. మొదటిది, ఖవాజా ఆ పుస్తకంలోని విషయాలను ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు వివరించినట్లు కోడ్ స్పోర్ట్స్ నివేదించింది. సిరీస్‌కు ముందు జరిగిన తన పత్రికా సమావేశంలో కమిన్స్ ఈ సంభాషణను ధృవీకరించారు. రెండవది, మార్చి 2018 నాటి కేప్ టౌన్ కుంభకోణం తర్వాత ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాలో టెస్ట్ పర్యటన చేయడం ఇదే మొదటిసారి. వారు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం రెండుసార్లు తిరిగి వచ్చారు, కానీ టెస్టుల కోసం ఎప్పుడూ రాలేదు.