తొలి వందేభారత్ స్లీపర్.. ప్రారంభించిన మోదీ
ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఇది పశ్చిమ బెంగాల్లోని హావ్డా- అస్సాంలోని గువాహటి (కామాఖ్య) మధ్య రాకపోకలు సాగించనుంది. అదేవిధంగా ఏడు అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు. స్థానికంగా వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు….
ఇప్పటికే దేశ వ్యాప్తంగా 150 వందభారత్ రైళ్లు ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి. ఇక సుదూర రాత్రి ప్రయాణాల కోసం తయారు చేసిన, వందేభారత్ స్లీప్ రైలు కోసం దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్నారు. తాజాగా తొలి వందేభారత్ స్లీపర్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని మాల్డాలో ఈ రైలుకు జెండా ఊపి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైలు హౌరా- గౌహతి నడుమ సర్వీసులు అందించనుంది..
ఈ వందేభారత్ స్లీపర్ రైలు ప్రయాణీకులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన, సాంకేతికంగా అధునాతన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైల్లో ఎర్గోనామిక్ బెర్త్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు, ఆధునిక ఆన్ బోర్డ్ సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఇవి సుదూర ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా కొనసాగించేలా రూపొందించబడ్డాయి. భారతదేశ రైల్వే మౌలిక సదుపాయాలకు, ముఖ్యంగా రాత్రిపూట మార్గాలకు అప్ గ్రేడ్గా భావిస్తున్నారు.
రైలును ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, లోకో పైలట్లు, రైల్వే సిబ్బందితో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న రైల్వే సిబ్బంది కృషిని ప్రధానమంత్రి అభినందించారు. అటు మాల్దాకు వచ్చే గౌహతి-హౌరా వందే భారత్ స్లీపర్ రైలును కూడా ఆయన వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. హౌరా-గౌహతి మార్గంలో ప్రయాణ సమయాన్నిఈ రైలు సుమారు 2.5 గంటలు తగ్గిస్తుందన్నారు. ఈ రైలు కామాఖ్య దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు పర్యాటక రంగానికి పెద్ద ఊపునిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959