మేడారానికి పోటెత్తిన భక్తులు..!

*మేడారానికి పోటెత్తిన భక్తులు*

తెలంగాణ : ములుగులోని మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాగారం నుంచి మేడారం వరకు, కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు వాహనాల రద్దీతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పార్కింగ్ కోసం వాహనాలను పొలాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది….

ఉదయం పూట గద్దెల వద్దకు భక్తులను అనుమతించిన పోలీసులు 10 గంటల సమయంలో రద్దీ పెరగడంతో గ్రిల్స్‌కు తాళాలు వేసి బయట నుంచే దర్శనం కలిగించారు. కల్యాణ మండపం వద్ద ఉన్న క్యూ ద్వారానే భక్తులను దర్శనానికి పంపించారు. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి క్యూ ద్వారా వచ్చే భక్తులను గద్దెల వద్దకు వెళ్లకుండా గేట్లను మూసివేశారు. ప్రోటోకాల్‌ దర్శనాలని కొందరిని దర్జాగా గద్దెల వద్దకు అనుమతించగా, సామాన్య భక్తులు మాత్రం దర్శనానికి గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చింది. శుక్రవారం ఒక్కరోజే 6 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959
.