ప్రాణం పోయే ఆఖరి క్షణంలో దేవదూతల్లా ప్రత్యక్షమైన కొత్త జంట..!.వరద ప్రవాహంలో చిక్కుకున్న యువ బైకర్‌ను ప్రాణాలకు తెగించి కాపాడిన దంపతులు..

ప్రాణం పోయే ఆఖరి క్షణంలో దేవదూతల్లా ప్రత్యక్షమైన కొత్త జంట..!

వరద ప్రవాహంలో చిక్కుకున్న యువ బైకర్‌ను ప్రాణాలకు తెగించి కాపాడిన దంపతులు..

వరద ప్రవాహంలో చిక్కుకుని మరో క్షణంలో కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్న ఓ యువ బైకర్‌ను కొత్తగా పెళ్లైన ఓ జంట ప్రాణాలకు తెగించి కాపాడింది. ప్రమాదకర పరిస్థితుల్లోనూ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా యువకుడిని రక్షించేందుకు ఆ జంట చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.

వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో యువ బైకర్ ప్రవాహంలో చిక్కుకుపోయాడు. క్షణక్షణానికి పరిస్థితి విషమిస్తుండగా.. అక్కడే ఉన్న కొత్తగా పెళ్లైన జంట వెంటనే స్పందించింది. యువకుడిని రక్షించేందుకు వధువు తన దుప్పట్టాను అందించగా.. వరుడు ఆమెతో కలిసి ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా ముందుకు వెళ్లాడు.

ఇద్దరూ కలిసి యువకుడిని పట్టుకుని అతి కష్టంగా సురక్షితంగా ఒడ్డుకు లాగారు. కేవలం కొన్ని సెకన్లు ఆలస్యమై ఉంటే పరిస్థితి మరింత విషాదంగా మారేదని అక్కడి పరిస్థితిని చూసిన వారు చెబుతున్నారు.

తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడిన ఈ కొత్త జంటపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రక్త సంబంధం లేకపోయినా.. ఆపదలో ఉన్న మనిషిని కాపాడేందుకు ముందుకొచ్చిన ఈ దంపతులు మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు.

ఆపదలో ఆదుకున్న ఈ ‘హ్యూమన్ ఏంజెల్స్’కు హ్యాట్సాఫ్..!