కేసీ వేణుగోపాల్‌తో గంటకు పైగా సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం…. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక చర్చ…!

ఢిల్లీ: కేసీ వేణుగోపాల్‌తో గంటకు పైగా కొనసాగిన సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం.. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాలపై చర్చ.. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక చర్చ.. రేపు ఉదయం కేసీ వేణుగోపాల్‌తో మీనాక్షి నటరాజన్‌, మహేష్‌గౌడ్‌ భేటీ.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ముగిసింది. కేసీ వేణుగోపాల్‌తో గంటకుపైగా రేవంత్‌రెడ్డి సమావేశం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై చర్చించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలపై ఇరువురి మధ్య కీలక చర్చ జరుగినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలపై కేసీ వేణుగోపాల్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశంపై, మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఇవాళ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్‌ అధిష్ఠానం దిల్లీకి పిలిచడంతో ఆమె హుటాహుటిన కొండా సురేఖ దిల్లీ వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు సైతం దిల్లీకి చేరుకున్నారు. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం దిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు.