ఎన్ని రోజులు తిరగాలి కోర్టుల చుట్టూ తిరగాలి..కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు..

మాపై వున్నా కేసులు తీసేయండి ఎన్ని రోజులు తిరగాలి కోర్టుల చుట్టూ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. జరుతున్న పరిణామలా మీద ఆవేదన వ్యక్తం చేయాలనీ చాలా సార్లు సీఎంకు విన్నవించికోవాలని చూసానని అన్నారు.మేము ఎక్కడికి వెళ్లిన ఏం చేసిన మా పైన బీఆర్ఎస్ నాయకులు కేసులు పెట్టారని తెలిపారు. బీఆర్ఎస్ పీడ పోయిందన్న సీఎం ఇప్పుడు ఏం మాట్లాడుతలేదని ఆవేదన వ్యక్తం చేసారు. మేము కలిసి చెప్దామంటే టైమ్ ఇస్తలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పెద్ద లీడర్.. నాలుగేండ్లలో ముఖ్య మంత్రి అయింది ఒక్కడివే అన్నారు. ఇరవై ఏండ్లు ఉన్నా ఒకరు ముఖ్య మంత్రి కాలేదు.. పార్టీ బలోపేతం చేసి అసంబ్లీ ఎన్నికల్లో గెలుపించావన్నారు. .కార్యకర్తలు, బాధపడుతున్నారు అది గమనించగలరు అని విన్నవించుకున్నారు. బీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ గెలుపించారన్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్నా వాళ్లకు న్యాయం చేయకుండా మనపై కేసులు పెట్టినవాళ్లకు న్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి సీటు రాజగోపాల్ రెడ్డి సతీమణికి కావాలనుకున్నారు కానీ బీసీ బిడ్డ కి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు అలా ఉండాలన్నారు. బయట పైసలు సంపాదించినోళ్లు మనదాంట్లకు వస్తున్నారు ఎందుకో అర్థం చేసుకోండి అంటూ తెలిపారు. ఒక్క సైడ్ వినకు రెండు సైడ్స్ విను సీఎం అన్నారు. అందరికి న్యాయం జరగాలన్నారు. నేను మీకు వ్యతిరేకం కాదు ఎవ్వరికి అన్యాయం జరగొద్దనేది నా ఆవేదన అన్నారు వీహెచ్.. మాపై వున్నా కేసులు తీసేయండి ఎన్ని రోజులు కోర్టుల చుట్టూ తిరగాలని, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆహ్వానించడం కరెక్ట్ కాదన్నారు..