హీరో విజయ్ దేవరకొండపై ఫిర్యాదు
హీరో విజయ్ దేవరకొండపై HYDలోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల ‘రెట్రో ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. ఆదివాసీలను అవమానించారంటూ విజయ్పై న్యాయవాది లాల్ చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, కేసు నమోదు చేయడంపై పోలీసులు న్యాయ సలహా కోసం వేచి ఉన్నట్లు సమాచారం. ఇటీవల విజయ్ తమకు క్షమాపణలు చెప్పాలని APలోని మన్యం జిల్లా ఆదివాసీ JAC నేతలు సైతం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.