వాట్సాప్ యూజర్లకు అద్భుతమైన న్యూస్
త్వరలో 15 నిమిషాల ఆటో-డిలీట్ మెసేజ్ ఫీచర్ రాబోతుంది..
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగంలో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వినియోగదారుల ప్రైవసీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ‘సీక్రెట్ మెసేజ్’ కాన్సెప్ట్‌లో భాగంగా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది.
WABetaInfo వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉండి కొద్దిమంది వినియోగదారులకు మాత్రమే పరీక్షార్థం అందుబాటులో ఉంది.
గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.12.2లో ఈ ఫీచర్‌ను గుర్తించారు. ఈ ఫీచర్‌కు ‘After Reading’ అనే పేరు ఇచ్చారు.
అంటే ఒకసారి మెసేజ్ చదివిన వెంటనే అది స్వయంచాలకంగా డిలీట్ అవుతుంది…
మీ వాట్సాప్ చాట్ మెసేజ్ చదివిన వెంటనే అదృశ్యమైపోతుంది..
వాట్సాప్ ఆఫ్టర్ రీడింగ్ పేరుతో ఫీచర్ ప్రవేశపెట్టే అవకాశం.
WhatsApp New Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. అతి త్వరలో అద్భుతమైన ఫీచర్ రాబోతుంది. ఇకపై మీరు పంపిన మెసేజ్ ఆటో డిలీట్ అవుతుంది. సాధారణంగా వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పంపితే అది డిలీట్ చేసేవరకు అలానే కనిపిస్తుంది.., రాబోయే కొత్త ఫీచర్ ద్వారా మీరు పంపిన మెసేజ్ దానికి అదే 15 నిమిషాల్లో ఆటో డిలీట్ అయిపోతుంది. మెసేజ్ విషయంలో ఎక్కువగా ప్రైవసీ కోరుకునే యూజర్లకు బెస్ట్ ఫీచర్. వాట్సాప్ ఈ ఆటో డిలీట్ ఫీచర్ అతి త్వరలో రాబోతుంది. ప్రస్తుతానికి వాట్సాప్ ఈ ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది.
వాట్సాప్ ‘ఆఫ్టర్ రీడింగ్’ ఫీచర్ :
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ మెసేజ్ చదివిన వెంటనే చాట్ నుంచి వెంటనే మాయమైపోతుంది. ఈ ఫీచర్‌కు ‘ఆఫ్టర్ రీడింగ్’ అని పేరు పెట్టారు. ఎవరైనా మెసేజ్చదివిన వెంటనే ఆటో డిలీట్ చేయొచ్చు…..
ఇప్పటి వరకు వాట్సాప్ లో ఉన్న ‘Disappearing Messages’ ఫీచర్లో వినియోగదారులు 24 గంటలు, 7 రోజులు, 90 రోజులు వంటి కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆ సమయం పూర్తయిన తర్వాతే మెసేజ్‌లు తొలగిపోతాయి. కానీ కొత్త ‘After Reading’ ఫీచర్లో మాత్రం ఎలాంటి టైమ్ లిమిట్ అవసరం ఉండదు.
మెసేజ్ రిసీవర్ చదివిన వెంటనే అది ఆటోమేటిక్‌గా మాయం అవుతుంది.
సీక్రెట్ మెసేజ్ పంపాలనుకునే వినియోగదారులు మెసేజ్ పంపే సమయంలో ఈ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి..
ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా WABetaInfo షేర్ చేసింది..