రోజురోజుకూ మరింత పెరుగుతున్న చలి తీవ్రత …

R9TELUGUNEWS.COM.: తెలంగాణను చలి వణికిస్తున్నది. రోజురోజుకూ మరింత పెరుగుతున్న చలి తీవ్రత పెరుగుతుండగా.. మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల దట్టంగా పొగమంచు కురుస్తున్నది. చలిగాలలు భారీగా వీస్తున్నాయి. ఉత్తర భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో శీతలగాలులు తెలంగాణ వైపు వీస్తున్న ఉధృతంగా వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చలితీవ్రత పెరుగుతున్నది. ఈ నెల 27వ తేదీ వరకు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది.