ఈ వారం రాశిఫలాలు…!!

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*శ్రీమన్మహాగణాధిపతయే నమః*
*ఓం శ్రీమాత్రేనమః*
*శ్రీవిష్ణురూపాయ నమశ్శివాయ*
*శ్రీ నవగ్రహదేవతాభ్యో నమః*

*ది. 28-12-2025(ఆదివారం) నుండి 03-01-2026(శనివారం) వరకు గల వారఫలాలు*

*మేషరాశి– 🦌🦌🦌🦌🦌🦌*

*(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)*

*మొదట్లో పనులు కొంత మందగించినా చివరికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. జీవితాన్ని మలుపు తిప్పే సమాచారం అందుతుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. ఉద్యోగ యత్నాలు సానుకూలం. విచిత్ర సంఘటనలు ఎదురౌతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఋణబాధలు తొలగుతాయి. కొన్ని వేడుకలరీత్యా ఖర్చులు. ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంటుంది‌. పెద్దల ఆశీస్సులు, సలహాలు స్వీకరిస్తారు. ఆస్తుల వ్యవహారంలో చిక్కులు వీడతాయి. వాహనాలు, బంగారం కొంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంత పురోగతి కనిపిస్తోంది. విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయ, క్రీడాకారుల కలలు నెరవేరుతాయి. టెక్నికల్ రంగం వారికి కొత్త అవకాశాలు దగ్గరగా వస్తాయి. మహిళలకు విశిష్ట పురస్కారాలు అందుతాయి. ఐతే, ఆది, గురు, శుక్రవారాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. అనుకోని ఖర్చులు, కుటుంబంలో సమస్యలు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశను కల్గిస్తాయి.*
*ఈ వారమంతా ఎక్కువగా నవగ్రహ స్తోత్రాలు పఠించండి!*
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
*వృషభరాశి– 🐂🐂🐂🐂🐂🐂*
*(కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు)*

*చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సన్నిహితులు, మిత్రులనించి కీలక సమాచారం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. ఎప్పుడూ ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కొంత సొమ్ము అకస్మాత్తుగా లభిస్తుంది. అవసరాలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. సంతానపరంగా శుభవార్తలు వింటారు. బంధువుల ప్రేరణతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వివాహాది యత్నాలు అనుకూలిస్తాయి ‌ ఆస్తి వ్యవహారాలలో చిక్కులు వీడతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు లేకుండా లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న విధంగా ప్రొమోషన్లు రాగలవు. విధులు సకాలంలో నిర్వహిస్తారు. వైద్యులు, క్రీడాకారులు, పారిశ్రామిక వేత్తలకూ నూతనోత్సాహం. టెక్నికల్ రంగంవారు నైపుణ్యం మరింతగా చాటుకుంటారు. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. సోమ, మంగళ, శనవారాలలో ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అదనపు ఖర్చులు, బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి ఔతారు. వృత్తి వ్యాపారాలు నిరాశను కల్గిస్తాయి. టెక్నికల్ రంగంవారు కాస్త నిరుత్సాహానికి గురవుతారు.*
*ఈ వారమంతా ఎక్కువగా శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి!*
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
*మిథునరాశి– 👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨*
*(మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)*

*ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కీలక సమాచారం అందుతుంది. చిరకాల ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగ్గా ఉంటుంది ‌ ఆకస్మిక ధనలాభం. పొదుపు వైపు దృష్టి సారిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. సంతానపరంగా సమస్యలు తీరుతాయి. ఆస్తి వివాదాలు తీరుతాయి. అనుకోని రీతిలో ఒప్పందాలు (అగ్రిమెంట్లు) చేసుకుంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితికి చేరుకుంటారు. మీ ఆలోచనలు పైస్థాయివారికి నచ్చడంతో వాటిని అమలు పరుస్తారు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకూ అనుకోని అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగంవారి యత్నాలలో పురోగతి కలుగుతుంది. మహిళలకు విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి. గురు, శుక్రవారాలు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో తగాదాలు, వృత్తి వ్యాపారాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు రద్దు కాగలవు.*
*ఈ వారమంతా ఎక్కువగా శ్రీ దత్తాత్రేయుని పూజించండి!*
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
*కర్కాటకరాశి– 🦀🦀🦀🦀🦀🦀*
*(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)*

*ఒక దీర్ఘకాలిక సమస్యకు అనుకూలంగా పరిష్కారం లభిస్తుంది. మిత్రుల చేయూతతో పనులు సక్రమంగా నిర్వహిస్తారు. సేవాభావం పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ‌ పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఎంతోకాలంగా రావాల్సిన సొమ్ము ఇప్పుడు అందుతుంది. ఋణబాధలు తొలగుతాయి ‌ ఊరట లభిస్తుంది. కుటుంబంలో మీ ప్రేమాభిమానాలు అందరికీ పంచుతారు.‌వివాహయత్నాలు సానుకూలంగా ఉంటాయి. సంతానంనుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. జ్ఞాతులతో ఆస్థివివాదాలపై ఒక అంగీకారానికి వస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులుసైతం సమకూరైచుకుంటారు. ఉద్యోగాలలో విధుల్లో నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. సహచరుల సాయం అందుతుంది. వైద్యులు, క్రీడాకారుల కృషి ఫలిస్తుంది. కళాకారులు కొత్త అవకాశాలు అందుకుంటారు. టెక్నికల్ రంగంవారి దీర్ఘకాలిక స్వప్నం సాకారం అయ్యే సమయం. మహిళలకు పురోగతి. శని, ఆదివారాల్లో మానసిక ఆందోళన. ఆస్తి వివాదాలు, ఆలోచనలకు స్థిరత్వం ఉండదు. వృత్తి వ్యాపారాలు నిరాశను కల్గిస్తాయి. కళాకారులకు అవకాశాలు కొంత అసంతృప్తిని కల్గిస్తాయి.*
*ఈ వారమంతా ఎక్కువగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి!*
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
*సింహరాశి– 🦁🦁🦁🦁🦁🦁*
*(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)*

*కొన్ని విషయాలలో అతి విశ్వాసం వద్దు. సొంత ఆలోచనలతో ముందడుగు వేయడం మంచిది. ఆలోచనలు ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన కష్టాలు కొలిక్కి వచ్చి ఫలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు అనూహ్యంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు శుభవర్తమానాలు అందుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. అవసరాలు తీర్చుకుంటారు. కొన్ని ఖర్చులు ఎదురైనా వాటిని అధిగమించడానికి యత్నిస్తారు. అందరితోనూ సత్సంబంధాలు నెలకొంటాయి. మీపై అలక వహించిన సోదర సోదరీమణులు తిరిగి ప్రేమానురాగాలు కురిపిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు లోటుండదు. ఆస్తుల క్రయవిక్రయాలు సజావుగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి. అనుకున్న విధంగా భాగస్వాములతో ఒప్పందాలు అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నతస్థితికి చేరుకునే అవకాశం ఉంది. పనితీరుపై సంతృప్తి చెందుతారు. కళాకారులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు వీరందరికీ విదేశీ పర్యటనలు తథ్యం. టెక్నికల్ రంగంవారికి ఊహించి చేయూత లభిస్తుంది. అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసేంతవరకు విశ్రమించరు. మహిళలు ఆస్తిలాభం పొందుతారు. ఆది, సోమ, మంగళ వారాల్లో ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొన్ని అగ్రిమెంట్లు తిరిగి రాసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం కొంచెం మందగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. క్రీడాకారులకు అవకాశాలు అంతగా కలిసిరావు.*
*ఈ వారమంతా ఎక్కువగా గణపతిని పూజించండి!*
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
*కన్యారాశి– 💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻*
*(ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)*

*ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో సమావేశం అవుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు‌. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. విలాసవంతంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలంగా ఉంటాయి. రుణ బాధలు తగ్గుతాయి. ఖర్చులు తగ్గించుకుంటూ వస్తారు. కుటుంబంలోని అందరి ప్రేమనూ పొందుతారు. జీవితాశయం సాధిస్తారు. బంధువుల మనస్తత్వాన్ని అనుసరించి వ్యవహరిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో మధ్యవర్తుల సూచనలు పాటిస్తారు. మొత్తానికి ఎంతో కొంత లాభం చేకూరుతుంది. వాహనయోగం ఉంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో మీ వంతు వాటా పెంచుకుంటారు. ఉద్యోగాలలో క్లిష్టమైన సమస్యలు తీరతాయి. బదిలీలు నిలిచిపోతాయి. వైద్యులు, పారిశ్రామిక, రాజకీయవేత్తలు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారికి మరింత అనుకూలమైన పరిస్థితులు ఉండవచ్చు. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంగళ, బుధ, గురువారాలలో అయోమయంగా ఉంటుంది. లేనిపోని ఖర్చులు రావచ్చు. తట్టుకునేలా ముందుగానే ప్రణాళిక వేసుకుంటే మంచిది. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని చిక్కులు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వైద్యులు ఆశా నిరాశలతో గడుపుతారు.*
*ఈ వారం అంతా ఎక్కువగా దత్తాత్రేయుని పూజించండి!*
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
*తులారాశి– ⚖️⚖️⚖️⚖️⚖️⚖️*
*(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)*

*యత్న కార్యసిద్ధి ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కొంత సొమ్ము అంది, అవసరాలు తీరుతాయి. అప్పుల బాధల నుండి బయటపడతారు. పొదుపు ద్వారా సమకూరిన డబ్బుతో ఒక అవసరం తీరుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభకార్యాల నిర్వహణలో బిజీగా గడుపుతారు. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు సాగిస్తారు. స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులు సమకూరి, మరింతగా విస్తరిస్తాయి. బ్యాంకు రుణాల ద్వారా పెట్టుబడులు రెట్టింపు చేస్తారు. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు తొలగుతాయి. విధులు సజావుగా సాగుతాయి. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మాన యోగం ఉంది. టెక్నికల్ రంగం వారి కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. మహిళలకు నూతన ఉద్యోగయోగం ఉంది. గురు, శుక్ర, శనివారాలలో దూర ప్రయాణాలు ఉండవచ్చు. అదనపు ధన వ్యయం. ఆరోగ్య సమస్యలతో కుస్తీపడతారు. వృత్తి వ్యాపారాలు కొంత నిరుత్సాహ పరుస్తాయి. క్రీడాకారులు కళాకారులకు చిక్కులు ఉంటాయి.*
*ఈ వారం అంతా ఎక్కువగా శ్రీ ఆంజనేయ దండకం పఠించండి!*
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
*వృశ్చికరాశి– 🦂🦂🦂🦂🦂🦂*
*(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)*

*ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. శత్రువులు మిత్రులుగా మారడమే కాకుండా, సహాయం కూడా అందిస్తారు. గతం నుండి కొనసాగుతున్న పొరపాట్లు సరిదిద్దుకుంటారు. విద్యార్థులు ఆశించిన విధంగా ఫలితాలు సాధిస్తారు. చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురు కావచ్చు. రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. రుణదాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు. సోదరులతో సోదరీమణులతో ఆనందంగా గడుపుతారు. ఒక వ్యవహారంపై అందరూ కలిసికట్టుగా నిర్ణయానికి వస్తారు. శుభకార్యాలకు ఒక ప్రణాళిక రూపొందిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. భూములు కొనుగోలుకు సంబంధించి కొన్ని అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. మీకు తగిన గౌరవం లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, వైద్యులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. టెక్నికల్ రంగం వారు ప్రాజెక్టు పనులను మరింత నేర్పుగా పూర్తి చేస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. శని, ఆదివారాలలో కుటుంబంలో ఒత్తిడులు తప్పవు. ఎంత కష్టించినా ఫలితం శూన్యం. దూర ప్రయాణాలు, వృత్తి వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. టెక్నికల్ రంగం వారు ఈ రెండు రోజులలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.*
*ఈ వారమంతా ఎక్కువగా దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకుంటే లేదా చేస్తే మంచిది!*
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
*ధనూరాశి– 🏹🏹🏹🏹🏹🏹*
*(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)*

*కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విలువైన సమాచారం రాగలదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. మరింత, పొదుపు పథకాలకు మళ్ళిస్తారు. కుటుంబ సభ్యులు మీపై మరింత ప్రేమను చూపుతారు. సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పిల్లల శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కోర్టులో ఉన్న సమస్య తీరుతుంది. వ్యాపారాలలో అనుకోని లాభాలు పొందుతారు. పెట్టుబడులు కూడా అందుతాయి. భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుండి గట్టెక్కుతారు. విధులను ప్రశాంతంగా పూర్తి చేస్తారు. వైద్యులు, పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు. ఊహించని అవకాశాలు లభించవచ్చు. కళాకారులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. టెక్నికల్ రంగంవారు తమ సత్తా చాటుకుంటారు. మహిళలకు, కుటుంబ సభ్యులతో సఖ్యత మరింత పెరుగుతుంది. ఆది, సోమ మంగళవారాలు ప్రయాణాలలో అవాంతరాలు ఉండవచ్చు. రుణ యత్నాలు. కుటుంబంలో కొత్త సమస్యలు. వృత్తి వ్యాపారాలలో చికాకులు. రాజకీయవేత్తలకు వివాదాలు రాగలవు.*
*ఈ వారమంతా ఎక్కువగా హయగ్రీవ స్తోత్రాలు పఠించండి!*
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
*మకరరాశి– 🐊🐊🐊🐊🐊🐊*
*(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు)*

*పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ప్రముఖుల నుండి వచ్చిన సమాచారం మీలో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక విషయాలలో ప్రగతి ఉంటుంది. రెండు మూడు విధాలుగా ధనలబ్ధి చేకూరుతుంది. కుటుంబ సమస్యల నుండి గట్టెకుతారు. బంధువుల ద్వారా అందిన సమాచారం ఊరట ఇస్తుంది. అందరితో ఉల్లాసంగా గడుపుతారు. వివాహాది వేడుకలకు శ్రీకారం చుడతారు. ఆస్తులు సమకూర్చుకునేందుకు సంబంధిత వ్యక్తులతో సంప్రదిస్తారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం. పదోన్నతుల జాబితాలో మీ పేరు ఉండడం విశేషం. వైద్యులు, కళాకారులు, రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతమైన కాలం. టెక్నికల్ రంగంవారికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు భూ లాభాలు ఉంటాయి. మంగళ, బుధ, గురువారాలు దూర ప్రయాణాలు. ధనవ్యయం సూచన. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడిలు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు సమస్యలతో నడుస్తాయి. టెక్నికల్ రంగం వారికి కొన్ని మార్పులు ఉండవచ్చు.*
*ఈ వారమంతా ఎక్కువగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి!*
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
*కుంభరాశి– 🏺🏺🏺🏺🏺🏺*
*(ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)*

*శ్రమ మరింతగా పెరుగుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తి కాగలవు. మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రత్యర్ధులు కొంత అనుకూల వైఖరి అనుసరించడం విశేషం. నిరుద్యోగులకు అంతగా అనుకూలం కాదు. రావలసిన సొమ్ము ఆలస్యంగా అందినా అవసరాలు తీరుతాయి. రుణాలు తీరే సూచనలు ఉన్నాయి. మీ యత్నాలకు కుటుంబ సభ్యులు చేయూతను అందిస్తారు. కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఎంతోకాలంగా చికాకు పరుస్తున్న ఆస్తి వ్యవహారంలో కదలికలు వస్తాయి. నూతన పెట్టుబడులకు మార్గం సులువు అవుతుంది. భాగస్వాములతో వివాదాలు తీరుతాయి. ముందుకు సాగుతారు. కొత్త బాధ్యతలు చేపడతారు. వైద్యులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు తొలగుతాయి. టెక్నికల్ రంగంవారికి ఊహించని అవకాశం ఒకటి రాగలదు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. ఆది, గురు, శుక్రవారం ఆకస్మిక ప్రయాణాలు సూచన. ఒప్పందాలను రద్దు చేసుకుంటారు. వ్యవహారాలలో అవాంతరాలు. కుటుంబంలో ఒత్తిడిలు. వృత్తి వ్యాపారాలలో కొంత నిరుత్సాహం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త సమస్యలు ఎదురు కావచ్చు.*
*ఈ వారం అంతా ఎక్కువగా శ్రీ గణేశాష్టకం పఠించండి!*

*మీనరాశి– 🐟🐟🐟🐟🐟🐟*
*(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)*

*పనులు నెమ్మదిగా సాగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. అందరిలోనూ మీకు పలుకుబడి పెరుగుతుంది. మీ ద్వారా ఉపకారం పొందినవారు సహాయం అందించేందుకు ముందుకు వస్తారు. మీ ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. ఆకస్మిక ధన లాభాలు ఉన్నాయి. పొదుపు పథకాలలో చేరతారు. సోదరులు, సోదరీమణులతో వివాదాలు సర్దుకుంటాయి. వివాహాది వేడుకలకు సన్నాహాలు చేసుకుంటారు. బంధువులతో మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. ఆస్తుల విషయంలో మీరే ఒక నిర్ణయానికి వచ్చి, కొంత తగ్గుతారు. తద్వారా ఒక అంగీకారానికి వస్తారు. వాహన యోగం ఉంది. వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు అందుతాయి. భాగస్వాముల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. భారం తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. కళాకారులకు నూతనోత్సాహం. టెక్నికల్ రంగంవారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు మానసిక అశాంతి తొలగుతుంది. సోమ, మంగళ, శనివారాలలో కుటుంబంలో గందరగోళ పరిస్థితి. అనారోగ్యం. మానసికంగా అశాంతి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. పారిశ్రామికవేత్తలు కళాకారుల ఆశలు ఫలించవు!*
*ఈ వారమంతా ఎక్కువగా హయగ్రీవ స్తోత్రాలు పఠించండి!*

*సర్వేజనాః సుఖినోభవంతు!*
*సమస్తసన్మంగళాని భవన్తు!*
*తన్మేమనః శివసంకల్పమస్తు!*

గమనిక..
మీ ప్రాంతంలో A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959