సోషల్ మీడియా ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్ క్రాష్ ..

సోషల్ మీడియా ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్ క్రాష్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్స్ పేజీ లోడ్ అవ్వడం లేదు.. కొత్త పోస్టులు పోవడం లేదు.. లాగిన్ కూడా కాలేకపోతున్నమంటూ వినియోగదారులల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వెబ్ మాత్రమే కాదు.. యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ అన్ని డివైజ్‌ల్లో ఎక్స్ సర్వీసు పూర్తిగా స్తంభించిపోయింది…ఔటేజ్-ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ (X Down) డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5:20 గంటలకు 1,000 కన్నా ఎక్కువ మంది వినియోగదారులు తమ అధికారిక అకౌంట్లను యాక్సెస్ చేయలేకపోతున్నారని రిపోర్టు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ భారీ అంతరాయాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది.వేలాది మంది వినియోగదారులు అవుట్‌టేజ్ ట్రాకింగ్ సైట్, డౌన్‌డెటెక్టర్‌లో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ లోపం విస్తృతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వెబ్ వెర్షన్ (x.com) అలాగే, ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లలో మొబైల్ అప్లికేషన్‌లలో ప్లాట్‌ఫారమ్‌కు యాక్సెస్‌ కోల్పోయినట్టు నివేదికలు సూచిస్తున్నాయి..మొబైల్ యాప్ నుంచి 61 శాతం ఫిర్యాదులు రాగా, ఆ తర్వాత వెబ్‌సైట్ 28శాతం, సర్వర్ కనెక్షన్ లోపాలు 11శాతంగా ఉన్నా యని డేటా వెల్లడిస్తుంది. ఈ విస్తృతమైన అంతరాయం ప్రపంచవ్యాప్త సమస్యగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులను తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

క్లౌడ్‌ఫ్లేర్ సిస్టమ్స్ ఫెయిల్ అవ్వడంతో వెబ్ యూజర్లు ఎక్స్ యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నివేదికల ప్రకారం.. ప్రొవైడర్ క్లౌడ్‌ఫ్లేర్‌లోని సమస్యల వల్ల ఈ తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీనిపై క్లౌడ్‌ఫ్లేర్ స్పందిస్తూ.. “క్లౌడ్‌ఫ్లేర్ సిస్టమ్స్ సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించి త్వరలోనే పరిష్కరిస్తాం,” మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని పేర్కొంది.

డౌన్ డిటెక్టర్ సర్వీసు కూడా సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంది. సైట్ లోడ్ అవుతున్నప్పుడు వినియోగదారుల రిపోర్టులలో భారీ పెరుగుదల నమోదైంది, చాలా మందికి “క్లౌడ్‌ఫ్లేర్ నెట్‌వర్క్‌లో ఇంటర్నల్ సర్వర్ లోపం ఎదురైంది..