చౌటుప్పల్ మండలం కైతాపురం జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇద్దరు డిఎస్పీలు మృతి..!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…

ఈ ప్రమాదంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇద్దరు డిఎస్పీలు మృతి చెందారు…….

ఎదురుగా ఉన్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి స్కార్పియో వాహనం డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి….

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు….

మృతి చెందిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డిఎస్పి చక్రధర్ రావు, డిఎస్పి శాంతారావు,

క్షతగాత్రులు అడిషనల్ ఎస్పీ ప్రసాద్….

డ్రైవర్ నర్సింగ్ రావు లను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కామినేని తరలించిన పోలీసులు…

ప్రాథమిక సమాచారం ప్రకారం, చక్రధర్ రావు, శాంతారావు, అదనపు ఎస్పీ ప్రసాద్ మరియు డ్రైవర్ నర్సింగ్ రావు స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తుండగా, ముందున్న లారీని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. వేగం ఎక్కువగా ఉండటం, రోడ్డు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కారణంగా వాహనం అదుపుతప్పిందని తెలుస్తోంది. స్కార్పియో వాహనం డివైడర్ ఎక్కి రాంగ్ రూట్‌లోకి దూసుకెళ్లడంతో విజయవాడ వైపు వస్తున్న భారీ లారీని ఎదురెదురుగా ఢీకొట్టింది. ఢీకొన్న దెబ్బకు వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.

మరణించిన అధికారులు ఎవరు?.

ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ రాష్ట్ర పోలీసు విభాగంలో విశేష సేవలందించిన అధికారులుగా పేరుపొందారు. వారి అకస్మాత్తు మరణం సహచరుల మధ్య తీవ్ర విషాదం నింపింది.