రాజీనామాపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి క్లారిటీ..అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను-..జీవన్‌రెడ్డి..

రాజీనామాపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి క్లారిటీ
పార్టీని వీడడానికి గల కారణాలపై లేఖ విడుదల
ఈనెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నా
అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను-జీవన్‌రెడ్డి
25న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా-జీవన్‌రెడ్డి..

నాలుగు దశాబ్దాలకు పైగా నాతో కలిసి ప్రయాణం చేసిన రాజకీయ సహచరులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులను ఉద్దేశించి జీవన్‌ రెడ్డి లేఖ రాశారు. గత 20 నెలలుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను మీరంతా గమనిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా అవమానాలకు గురవుతూ.. మానసిక క్షోభతో కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని అన్నారు. భవిష్యత్‌ ప్రణాళికపై మార్చి 25వ తేదీన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇందుకోసం జగిత్యాల పట్టణం గొల్లపల్లి రోడ్డులోని బండారి గార్డెన్‌లో ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొని మీ సూచనలతో పాటు, రాజకీయ ప్రస్థానంలో మీ తోడు, అండదండలతో, మానసిక స్థైర్యం కలగిస్తూ మార్గదర్శకంగా నిలవాలని కోరారు…