🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 13 – 05 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
బహుళ పక్షం,
తిథి : *పాడ్యమి* రా10.53 వరకు,
నక్షత్రం : *విశాఖ* ఉ8.02 వరకు,
యోగం : *పరిఘము* తె5.32 వరకు,
కరణం : *బాలువ* ఉ9.57 వరకు,
తదుపరి *కౌలువ* రా10.53 వరకు,
వర్జ్యం : *మ12.25 – 2.10,*
దుర్ముహూర్తము : *ఉ8.05 – 8.56,*
మరల *రా10.48 – 11.33,*
అమృతకాలం : *రా10.58 – 12.43,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 5.34,
సూర్యాస్తమయం: 6.18,
*_నేటి మాట_*
*ఆనందాన్వేషణ*
మానవుడు ఏదో పొందాలని ఆశిస్తున్నాడు కాని, ఏదో వానికి తెలియడం లేదు…
ఎప్పుడు చూసినా, “నాకు ఆనందం కావాలి” అంటాడు…
ఏ గుడికి వెళ్లినా, ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా … నాకు ఆనందం కావాలి, అని ప్రార్థిస్తుంటాడు…
కాని, ఆనందం ఎక్కడుందో వానికి తెలియటం లేదు, విద్యలో ఆనందమున్నదని భావించి విద్య నభ్యసిస్తున్నాడు.
కాని, ఆనందం చిక్కడం లేదు…
ఆ తరువాత ఉద్యోగం చిక్కాలని ఆశిస్తున్నాడు.
కాని, ఉద్యోగం చిక్కిన తరువాత కూడా ఆనందం చిక్కటం లేదు.
తదుపరి పెళ్ళి కావాలని ఆశిస్తున్నాడు.. పెళ్ళి అయిన తరువాత కూడా ఆనందం లేదు.
తరువాత పిల్లల అభివృద్ధిని ఆశిస్తున్నాడు.
ఈ విధంగా, ఆశలు పెరుగుతున్నాయేగాని, ఆనందం చిక్కడం లేదు, చచ్చేంత వరకూ మానవుడు ఆనందం కోసం ప్రాకులాడుతూనే ఉన్నాడు.
అయితే, అసలు ఆనందం ఎక్కడుంది?
ఆనందం ఎక్కడుందో తెలియకుండా దానికోసం వెతుకుతున్నాడు,అదే గ్రుడ్డితనము …
ఆనందము ఎక్కడో వస్తువులలో, వ్యక్తులలో, విషయాలలో లేదు.
తన హృదయంలోనే ఉన్నది, తానే ఆనందస్వరూపుడై ఉండి కూడా తిరిగి ఆనందాన్ని వెదకడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు వెఱ్ఱివాడై.
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏