ఏపీ పోలీసులకు వైసీపీ అధినేత జగన్ వార్నింగ్..!

50 చోట్ల ఇటీవల ఎలక్షన్ జరిగితే.. అందులో 39 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది..!

*🔹ఏపీ పోలీసులకు వైసీపీ అధినేత జగన్ వార్నింగ్*

_• ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు చంద్రబాబుకు ఊడిగం చేసే వారికి శిక్ష తప్పదు._

_మేం అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటాం..

_• యూనిఫామ్‌ తీయించి చట్టం ముందు నిలబెడతాం ఉద్యోగాలు లేకుండా చేస్తాం…జగన్

నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ లు చేయడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ (Ys Jagan) సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగుతున్న పోలీసులను కట్టడి చేయడానికి జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన పోలీసులను టార్గెట్ గా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. తాజాగా విజయవాడలో పోలీసులను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పోలీసులు రిటైర్ అయినా సరే వదలను అంటూ జగన్ వార్నింగ్ ఇచ్చారు…నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయానని జగన్ విమర్శించారు. వంశీ అరెస్టు దారుణం అని, , తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. ..

చంద్రబాబు మెప్పుకోసం పోలీసులు పని చేస్తున్నారని తప్పుబట్టారు. “టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా.. చంద్రబాబుకు వాచ్ మెన్లుగా పని చేస్తున్న పోలీసులకు చెప్తున్నా.. మీ బట్టలూడదీస్తా… మీ యూనిఫాం తీస్తా.. ఉద్యోగాలు లేకుండా చేస్తా.. ఎల్లకాలం చంద్రబాబు పాలనే సాగదు.. ప్రతీ పనికీ వడ్డీతో సహా లెక్కేసి దోషులుగా నిలబెడతా..” అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు…

ఆంధ్రప్రదేశ్‌లో 57 చోట్ల స్థానికల సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంటే.. సీఎం చంద్రబాబు రకరకాల సాకులు చెప్పి 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేయించారని జగన్ ఆరోపించారు. ఆ 50 చోట్ల ఇటీవల ఎలక్షన్ జరిగితే.. అందులో 39 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుందని చెప్పారు. చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని.. పోలీసులను వాచ్‌మెన్ల కంటే హీనంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఒక్క ఎంపీపీ పదవి పోతే చంద్రబాబుకు ఏం పోతోందని ప్రశ్నించారు జగన్…