యూసఫ్ గూడ – కృష్ణానగర్లో ఫేక్ ఓటు వేయడానికి వచ్చిన మహిళను పట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు..
https://x.com/r9telugunews/status/1988193888985903299?s=20
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 గా నమోదైన ఓటింగ్ శాతం.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 వరకు జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది బరిలో నిలవగా, నియోజకవర్గ పరిధిలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతతో పాటు 139 డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచి పర్యవేక్షిస్తున్నారు..
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేసిన పోలీసులు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపధ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ లపై కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు..