పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి..!

దిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. బాధ్యులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఉపా, పేలుడు చట్టం, బీఎస్ఎన్లోనిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.


అనుమానిత కారుకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను దిల్లీ పోలీసులు విడుదల చేశారు. హ్యుందాయ్‌ ఐ20 కారులో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హెచ్‌ఆర్‌ 26సీఈ 7674 నంబర్‌ ప్లేటు ఉన్న కారు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్‌ వద్ద దాదాపు మూడు గంటల పాటు ఉంచినట్లు కనుగొన్నారు. సోమవారం మధ్యాహ్నం 3:19 గంటలకు అక్కడికి వచ్చిన కారు, సాయంత్రం 6:30 వరకు అక్కడే ఉందని అధికారులు పేర్కొన్నారు. పేలుడుకు ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో ఉంది. పార్కింగ్‌లో ఉన్న సమయంలో అందులోని అనుమానితులు ఒక్కసారి కూడా కిందకు దిగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పేలుడుకు సంబంధించి సూచనల కోసం వారు అక్కడ ఎదురుచూస్తూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు..

3 గంటలపాటు పార్కింగ్..!?

హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు
ఘటనకు ముందు కారు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు పరిశీలించగా హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
కారు ‘HR 26 CE 7674’ నంబర్ ప్లేటుతో ఎర్రకోట సమీపంలోని పార్కింగ్‌లో దాదాపు మూడు గంటల పాటు ఉంచబడినట్లు గుర్తించారు.
పార్కింగ్ సమయంలో, సోమవారం మధ్యాహ్నం 3:19 గంటలకు అక్కడికి వచ్చిన కారు సాయంత్రం 6:30 వరకు అక్కడే ఉందని అధికారులు వెల్లడించారు.
ఆ సమయంలో కారులో ఉన్న అనుమానితులు ఒక్కసారి కూడా కిందకు దిగలేదని అధికార వర్గాలు చెప్పారు. వీరు పార్కింగ్‌లో ఎదురుచూస్తూ ఉంటారని అనుమానిస్తున్నారు.
ఇక, ఈ కారుపై పలు ట్రాఫిక్ చలానాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఎక్కువగా దిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఉన్నాయి..