జడేజా స్పిన్‌ మ్యాజిక్‌…సుదర్శన్ షాకింగ్ క్యాచ్..!

రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా (Team India) రెండో రోజు ఆటలో అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతమైన ఫార్మ్‌లో కనిపించారు..కరీబియన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి కష్టాల్లో పడింది..
భారత్ బౌలర్ల మత్తులో వెస్టిండీస్ (West Indies) బ్యాట్స్‌మెన్ మెల్లగా పరుగులు సేకరించడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో, ప్రస్తుతముగా క్రీజులో ఉన్న షాయ్ హోప్ (31), టెవిన్ ఇమ్లాచ్ (14) మాత్రమే కొంత ధైర్యాన్ని చూపుతున్నారు.అంతకుముందు, భారత బ్యాటర్ల పరుగుల సునామీకి అడ్డుకట్ట వేయలేక విండీస్ బౌలర్లు చేతులెత్తేశారు.

యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) అద్భుత శతకాలతో కదం తొక్కారు. సాయి సుదర్శన్ (87) అర్ధసెంచరీతో రాణించాడు. నితీశ్ రెడ్డి (43), వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (44) వేగంగా పరుగులు జోడించారు. జురెల్ ఔటైన వెంటనే, టీమిండియా 134.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 518 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

వెస్టిండీస్ బౌలర్లలో స్పిన్నర్ జోమెల్ వారికన్ (Spinner Jomel Warrick) మూడు వికెట్లతో రాణించాడు.అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్‌ను భారత స్పిన్నర్లు ఆరంభం నుంచే దెబ్బతీశారు. ముఖ్యంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో విండీస్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్ (10), తేజ్ నారాయణ్ చందర్ పాల్ (34)లను ఔట్ చేసిన జడేజా,

కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు

ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రోస్టన్ చేజ్‌ను డకౌట్ చేశాడు. చేజ్‌ను తన సొంత బౌలింగ్‌లోనే క్యాచ్ పట్టి పెవిలియన్‌కు పంపడం విశేషం. మరోవైపు, అలిక్ అథనేజ్ (41) కాసేపు నిలకడగా ఆడినప్పటికీ, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో విండీస్ 107 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ప్రస్తుతం మ్యాచ్ పూర్తిగా భారత్ నియంత్రణలో ఉంది. ఫాలో ఆన్ గండం నుంచి బయటపడాలంటే వెస్టిండీస్ మరో 179 పరుగులు చేయాల్సి ఉంది. మూడో రోజు ఆటలో భారత బౌలర్లను కరీబియన్ బ్యాటర్లు ఎంతవరకు ప్రతిఘటిస్తారనే దానిపైనే మ్యాచ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది…

రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. టీమ్ఇండియా యువ ఆటగాడు సాయిసుదర్శన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు..
క్యాచ్ అందుకునే క్రమంలో అతడి చిటికెన వేలికి గాయమైంది. దీంతో అతడు మైదానం నుంచి నిష్ర్కమించాడు.

వెస్టిండీస్ ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను రవీంద్ర జడేజా వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని విండీస్ ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (10) స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. బ్యాట్‌కు బాల్ కనెక్ట్ అయింది. అయినప్పటికి బంతి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సుదర్శన్ చేతుల్లోకి వెళ్లింది. తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా సుదర్శన్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు..బంతి అతడి కుడి చేతి చిటికెన వేలిని తాకింది. అయినప్పటికి సుదర్శన్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్‌ను చూసిన జాన్ కాంప్‌బెల్ షాకైయ్యాడు. తరువాత తేరుకుని మైదానం నుంచి నిష్ర్కమించాడు. దీంతో విండీస్ 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

క్యాచ్ అందుకున్న తరువాత సుదర్శన్ నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. పడిక్కల్ ప్రత్నామ్నాయ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు..
https://x.com/TKI_Cricket/status/1976934107365228901?t=sFw4p5-Jy0Bq18B-9g0Y7Q&s=19