సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా.దిలీప్ కొణతం.
అరెస్ట్ చేయొద్దని హై కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా కూడా కావాలని అక్రమంగా నిర్బంధిస్తున్నారు.
రిమాండ్ రిపోర్ట్ పేరిట నేను ఏం చెప్పకపోయినా వీళ్ళే కావాలని సొంత కథనాలు రాసుకున్నారు.
నేనేమీ నేరం చేయలేదు.. నామీద ఆరోపణలు ఏ ఒక్కటీ నేను ఒప్పుకోలేదు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నా మీద కేసులు పెడుతున్నారు.
ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆపను అన్నారు చివరిగా జై తెలంగాణా నినాదాలు చేశారు..
మరో ప్రీ లాంచ్ మోసం – బోర్డు తిప్పేసిన భారతి బిల్డర్స్
హైదరాబాద్ లో ఇష్టారీతిన సాగిన ప్రీలాంచ్ రియల్ఎస్టేట్ వ్యాపారాల్లో మోసాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తాజాగా ప్రీ లాంచ్ పేరిట రూ.200 కోట్లు వసూలు చేసి ఇళ్లు కట్టివ్వకుండా మోసం చేసిన సంస్థపై బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియల్ సంస్థ యజమాని ఇంటి ఎదుట 450 మందిని బాధితులు ఆందోళన చేశారు.
కొంపల్లిలో ఇళ్లు కట్టి ఇస్తామని భారతి బిల్డర్స్ ఫైనాన్షియర్ సునీల్ కుమార్ అహుజ ప్రకటనలు ఇచ్చారు. ప్రీ లాంచ్ ఆఫర్లో అతి తక్కువకే వస్తాయని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేశారు. దాదాపు 450 మంది నుంచి రూ.200 కోట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికి నాలుగేళ్లు అయింది. ఇళ్లు కట్టివ్వలేదు. డబ్బులు తిరిగివ్వలేదు. అదిగో… ఇదిగో అంటూ నాలుగు సంవత్సరాల నుంచి భారతి బిల్డర్స్ వారు తమను తిప్పుతూనే ఉన్నారు.
డబ్బులు చెల్లించినప్పుడు అందరికీ చూపించిన భూమి ప్రీ లాంచ్‌లో నగదు చెల్లించిన వారికి చెప్పకుండా తాకట్టు పెట్టేశాడు. బాధితులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో, అలాగే సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన…ఇప్పటివరకు పోలీసులు ఏలాంటి కేసు నమోదు చేయలేదు. లోటస్ పాండ్‌లో సునీల్ కుమార్ అహుజ నివాసం వద్ద కొంపల్లి వెంచర్ బాధితులు ఆందోళన చేపట్టారు. సునీల్ కుమార్ పై తక్షణం కేసులు పెట్టి తమ డబ్బు తమకు ఇప్పించాలని కోరుతున్నారు.
నాలుగేళ్లకిందట ప్రి లాంచ్ పేరుతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బులు వసూలు చేశారు. వారిలో అత్యధిక మంది మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి..
ఈ నిర్ణయాన్ని తాను 100 శాతం సపోర్ట్ చేస్తానని ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్.
రెండోసారి తండ్రయిన రోహిత్ శర్మ భార్య, బిడ్డలతో గడపడానికి BGT తొలి టెస్టుకు దూరమయ్యారు. ఈ నిర్ణయాన్ని తాను 100 శాతం సపోర్ట్ చేస్తానని ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ వెల్లడించారు. ఆ పరిస్థితుల్లో తాను ఉన్నా అదే పనిచేస్తానన్నారు. ‘క్రికెటర్లుగా మేం ఎన్నో త్యాగాలు చేస్తాం. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలకు దూరమవుతాం. ఆ సమయం మళ్లీ తిరిగిరాదు’ అని పేర్కొన్నారు..
ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురు.. అరెస్ట్ నుంచి రక్షించలేమన్న హైకోర్టు!
చంద్రబాబు, పవన్ లపై గతంలో వర్మ అనుచిత పోస్టులు..
కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు..
అరెస్ట్ నుంచి తనను రక్షించాలని వర్మ పిటిషన్
పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు
బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచన
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
కేసు వివరాల్లోకి వెళ్తే… గత ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టారు. సినిమాలో సైతం వీరిని కించపరిచే పలు సన్నివేశాలు ఉన్నాయి.
ఈ క్రమంలో వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విచారణకు హాజరుకావాలంటూ హైదరాబాద్ లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం రేపు పోలీసు విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. రేపటి పోలీసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది..
ఆరు సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ కన్నతండ్రిని చూసి బాగోద్వేగానికి గురైన కూతుర్లు..!
ఆరు సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ కన్నతండ్రిని చూసి బాగోద్వేగానికి గురైన కూతుర్లు. ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబిలిహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా బాలయ్య అనే వ్యక్తికి మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ‘ఆశ్రయం’ కల్పించడం జరిగింది. గత నెల రోజుల క్రితం బాలయ్య కూతురు దివ్య మన ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదానం నిర్వహించడాని వచ్చినప్పుడు తమ కన్నతండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడు అని చెప్పడం జరిగింది.
ఈరోజు మళ్ళీ బాలయ్య కూతుర్లు ఆశ్రమంలో అన్నదానం జరిపించడానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 130మందిలో తమ కన్నతండ్రిని గుర్తుపట్టి బాగోద్వేగానికి గురై కన్నతండ్రిని హత్తుకున్న ఈ దృశ్యాన్ని చూస్తే నిజంగా వారికి తమ తండ్రిని ఇంతకాలం ఎంతగా మిస్ అయ్యారో తెలుస్తుంది. ఇంతకాలం కన్నతండ్రి ప్రేమకు దూరమైన ఈ కూతుర్లకు నేడు తమ తండ్రిని ఒకటి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఉన్నపుడు మనకు ఈ నాన్న విలువ తెలియదు. ఉన్నప్పుడే మీ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూకోండి. వారిని ప్రేమించండి, పూజించండి..
పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్
విశాఖపట్నం – జి. మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి ఏకంగా 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది.
పాఠశాలకు ఆలస్యంగా వచ్చనంత మాత్రాన జట్టు కత్తిరించడం ఏంటని విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఇంచార్జ్ ప్రసన్న కుమారిని విధుల నుంచి వెంటనే తప్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు..
*నింగిలోకి జీశాట్ ఎన్-2*
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో సరికొత్త విధానానికి తెరలేపింది. శాస్త్ర సాంకే తిక రంగాలలో ఓవైపు స్వయం సమృద్ధి లో దూసుకెళుతూనే మరోవైపు టెక్నాలజీ విభాగాలతో ప్రైవేటు భాగస్వామ్యానికి దారులు వేస్తోంది.
అంతరిక్ష ప్రయోగాలలో మరో ప్రైవేట్ సంస్థ స్పేస్ఎక్స్తో ఇస్రో జోడీ కట్టింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రూపొందించిన జీశాట్ మరికొద్ది గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఇటీవల వరుస విజయాలతో రోదసీలోకి దూసుకెళుతున్న ఇస్రో.. తొలిసారిగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ సాయం తీసుకో నుంది. స్పేస్ఎక్స్ ఫాల్కన్- 9 రాకెట్ సహాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెడుతోంది.
అయితే జీశాట్ ఎన్2 బరువు 4700 కిలోల బరువు ఉంటుంది. ఈ క్రమంలోనే స్పేస్ఎక్స్ సహాయం తీసుకుంటోంది ఇస్రో సాంకేతికపరంగా ప్రైవేటు భాగస్వామి స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ జీశాట్-ఎన్2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టేం దుకు ఏర్పాట్లు చేస్తుంది.
స్పేస్ఎక్స్ రాకెట్‌ని ఉపయోగించుకొని ఇస్రో చేపడుతున్న తొలి వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగం జీశాట్. ఇది శాటిలైట్ విమానాల్లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది. మరోవైపు ఈ ప్రయోగం ద్వారా భారత్‌లోని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్‌ని విస్తరించవచ్చు…
లగచర్ల రైతుల మీద జాతీయ ఎస్టీ కమీషన్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే
లగచర్ల రైతుల మీద జాతీయ ఎస్టీ కమీషన్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే..
తాజాగా మరో కీలక పరమాణం చోటు చేసుకుంది. లగచర్లలో గిరిజన ప్రజలపై జరిగిన ఘటనపై ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ జాతీయ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే రాంచందర్ నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్ తదితరులు సోమవారం ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్‌ను కలిసి దాడిపై వివరించారు.
బీఆర్ఎస్ (BRS) నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్ ఆరోపించారు. రైతుల సమస్యలు వినడానికి, సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, నేడు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించనుంది. గిరిజనులపైన దాడి వివరాలు కమిషన్ తెలుసుకోనుంది. లగచర్ల నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్లి రైతులతో ముఖాముఖిలో కూడా పాల్గొననున్న విషయం తెలిసిందే..
లగచర్లలో రైతులు దాడి చేయడంపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్‌కు వినతి పత్రం ఇచ్చిన డాక్టర్ రాంచందర్ నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్…
ఏపీ శాసన మండలిలో అధికార పార్టీ మంత్రి వర్సెస్ అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు.. వాడి వేడిగా చర్చ..
ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ నాయకుల మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రావడంతో అవి ఎలాంటి పరిణామాలకు, వివరణలకు దారితీస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. వివిధ అంశాలపై ఏపీ శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంతకీ.. వీరిద్దరి మధ్య ఏం జరిగింది అంటే..
ఏపీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు సమాధాం చెబుతూ.. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్ అడ్డూ అదుపు లేకుండా సాగయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ముఖ్యంగా మైలవరం ప్రాంతంలోనూ మైనింగ్ కార్యక్రమాలు విరివిగా సాగయన్న మంత్రి..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి అడ్డుకట్ట వేసినట్లు వెల్లడించారు. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో.. గత ఎమ్మెల్యే ప్రోద్భలంతో అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం తాము.. చట్ట ప్రకారం అక్రమ మైనింగ్ ను కట్టడి చేశామంటూ ప్రకటించారు.
అప్పటి వరకు అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ.. అంతలోనే మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మైలవరంలో మైనింగ్ లో అక్రమాలు జరిగాయని మంత్రి ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పైగా గత ఎమ్మెల్యే హస్తం ఉందని మంత్రి శాసన మండలిలో చెప్పారని, అది తన గురించే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో సభలో నా పరువుకు భంగం కలిగిందంటూ వసంత కృష్ణ ప్రసాద్ సభలో మంత్రి వ్యాఖ్యలపై తన నిరసన తెలిపారు..
నిజామాబాద్ మేయర్ భర్త పై ఆటో డ్రైవర్ దాడి…
నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త మాజీ కార్పొరేటర్ శేఖర్ పై ఒక ఆటో డ్రైవర్ దాడి చేసిన సంఘటన కలకలం
స్థానిక నాగారంలోని అక్కడి కార్పొరేటర్ కు సంబంధించిన కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్ సుత్తితో దాడి చేసి కొట్టడంతో శేఖర్ కింద పడిపోయాడు…
అక్కడ చేరుకున్న ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు…
నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ భర్త బీఆర్ఎస్ నాయకుడు దండు శేకర్ పై సోమవారం నగరంలో దాడి జరిగింది. నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన రసూల్ అనే ఓ ఆటో డ్రైవర్ దండు శేకర్ పై సుత్తితో బలంగా దాడి చేశాడు. పొడవాటి సుత్తితో తలపై దాడి చేసి తీవ్రంగా గాయ పరచడం తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణాన్ని ఈ ఘటన ఒక్కసారిగా వేడెక్కించి ఉలిక్కిపడేలా చేసింది. నాగారం ప్రాంతంలోని బలహీన వర్గాల కాలనీలోని ఒక ఇంటి స్థలం కబ్జా విషయంలో దండు శేకర్ కు నిందితుడు రసూల్ కు మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రసూల్ కు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని దండు శేకర్ అనుచరులు గోపాల్ గ్యాంగ్ కబ్జాచేశారని, అందుకే కోపంతో దాడి చేసినట్లు విడియో లో తెలిపేరు…
*పరీక్షలో పారదర్శకత లోపించినందుకు NEET PG 2024 కౌన్సెలింగ్‌ను నిలిపివేయండి: SCలో పిటిషన్*
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ-ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ) 2024 పరీక్షపై వివాదాలు ఎప్పటికీ అంతం కానున్నాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రారంభం కావడంతో అడ్మిషన్ల కోసం జరుగుతున్న నీట్-పీజీ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
NEET-PG 2024 పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేకపోవడాన్ని సవాలు చేస్తూ పెండింగ్‌లో ఉన్న పిటిషన్లో దరఖాస్తు దాఖలు చేయబడిందని IANS నివేదించింది.
నవంబర్ 19న ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వైద్య కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ద్వారా కౌన్సెలింగ్‌ను హడావుడిగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోందని దరఖాస్తులో పేర్కొన్నారు. పిటిషనర్ అభ్యర్థుల హక్కులను ఓడించడానికి తేదీ నిర్ణయించబడింది.
“ఈ గౌరవనీయ న్యాయస్థానం ఇప్పటికే ఈ విషయాన్ని 19.11.2024న జాబితా చేయవలసిందిగా ఆదేశించినందున, విషయం అసంబద్ధంగా మారకుండా, ప్రస్తుత పిటిషన్‌ను విచారించే వరకు NEET PG 2024 కౌన్సెలింగ్‌ను వాయిదా వేయమని MCCని ఆదేశించాలని పిటిషనర్లు ప్రార్థిస్తున్నారు. మరియు పిటిషనర్లపై విశ్వాసం ఉంది, ”అని పిటిషన్ పేర్కొంది.
ఈ ఏడాది పీజీ మెడికల్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసిందని మెడికల్ డైలాగ్స్ గతంలో నివేదించాయి . రౌండ్ 1 ఎంపిక-ఫిల్లింగ్‌కు నవంబర్ 17 చివరి తేదీ అని మరియు నవంబర్ 18 మరియు 19 తేదీలలో సీట్ల కేటాయింపు జరగాలని షెడ్యూల్లో పేర్కొన్నారు.
పరీక్షకు మూడు రోజుల ముందు రెండు షిఫ్టులు ప్రవేశపెట్టడం, సాధారణీకరణ పద్ధతి, టై బ్రేకర్ ప్రమాణంలో మార్పు వంటివి విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపాయని నీట్-పీజీ అభ్యర్థులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
నీట్-పీజీ సమాచార బులెటిన్‌ను అధికారుల ఇష్టానుసారం సవరించవచ్చని, పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి నియమాలు లేదా నిబంధనలు లేవని పిటిషనర్లు వాదించారు.
ఈ సంవత్సరం పరీక్షకు అభ్యర్థుల ప్రశ్నపత్రాలు, సమాధానాల కీలు లేదా ప్రతిస్పందన షీట్లను బహిర్గతం చేయని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) పద్ధతిని ఇది సవాలు చేసింది.
పత్రాలు ఏవీ విద్యార్థుల పనితీరును తనిఖీ చేయడానికి అనుమతించనందున పరీక్ష నిర్వహణలో స్పష్టమైన పారదర్శకత లోపించిందని, ప్రశ్నపత్రం లేదా అభ్యర్థులు నింపిన ప్రతిస్పందన పత్రం లేదా సమాధానాల కీ ఏదీ లేదని పిటిషన్ పేర్కొంది. విద్యార్థులకు సరఫరా చేయబడింది మరియు కేవలం స్కోర్‌కార్డ్ అందించబడింది.
న్యాయవాది పరుల్ శుక్లా దాఖలు చేసిన పిటిషన్లో, అభ్యర్థి గత సంవత్సరాల మాదిరిగా కాకుండా, సరిగ్గా ప్రయత్నించిన ప్రశ్నల సంఖ్య మరియు తప్పుగా ప్రయత్నించిన ప్రశ్నల సంఖ్యతో పాటు వారి మొత్తం స్కోర్‌ను అందుకున్నారని, ఈ ఏడాది ఆగస్టు 23 న విడుదల చేసిన ఫలితాలు అందించలేదని హైలైట్ చేసింది. అభ్యర్థి మొత్తం స్కోరు.
“NEET PG 2024 కింద పరీక్షను ప్రతివాదులు (అధికారులు) నిర్వహించే పద్ధతి/పద్ధతి స్పష్టంగా ఏకపక్షంగా ఉంది మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద పొందుపరచబడిన రాష్ట్ర చర్యలో పారదర్శకత మరియు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది” అని అది జోడించింది.
NEET-PG ఇంతకు ముందు ఎప్పుడూ రెండు షిఫ్టులలో జరగలేదని మరియు జాతీయ పరీక్ష యొక్క ఏకరీతి ప్రమాణం మరియు నిష్పాక్షికతను నిర్ధారించడానికి ఎల్లప్పుడూ ఒకే-షిఫ్ట్ మరియు ఒకే రోజు పరీక్షగా మిగిలిపోయిందని పిటిషన్ పేర్కొంది.
ఇది “పరీక్ష నిర్వహణలో తీవ్రమైన పేటెంట్ లోపాన్ని” హైలైట్ చేసింది, ఉత్తమ అభ్యర్థులను అందించే పరిశుభ్రమైన, పారదర్శకమైన మరియు సమర్థవంతమైన పరీక్షా విధానాన్ని సాధించడానికి పరిష్కారం అవసరం.
“NEET-PG అనేది ఒక మల్టీడిసిప్లినరీ పరీక్ష, ఇక్కడ ఒకరి ర్యాంక్ వారు ఎంచుకున్న కోర్సు మరియు ఫీల్డ్‌ని ఎంచుకునే సామర్థ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది. మార్కులలో ఏదైనా స్వల్ప వ్యత్యాసం చాలా మంది అభ్యర్థులను వారి ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం పొందకుండా అడ్డుకుంటుంది,” అని అది జోడించింది.
ఈ విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, NBE చివరి నిమిషంలో పరీక్షా సరళిలో మార్పులపై సెప్టెంబర్ 20న సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందని మెడికల్ డైలాగ్స్ గతంలో నివేదించాయి. ఇది అసాధారణమైనదిగా పేర్కొంటూ, CJI DY చంద్రచూడ్, న్యాయమూర్తులు JB పార్దివాలా మరియు మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీం కోర్ట్ బెంచ్ NBE మరియు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది, వారంలోగా తమ కౌంటర్ దాఖలు చేయాలని కోరింది..
లగచర్ల ఘటనలో గ్రామస్థులను, రైతులను రెచ్చగొట్టింది సురేష్ కాదు ఒక ప్రభుత్వ ఉద్యోగి..!?
లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఘటన పై ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే దాదాపు 17 మందిని అరెస్ట్ చేసింది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేంధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత సురేష్ కూడా ఉన్నారు. పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డి పై కూడా వేటు పడింది. ఆయనను డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అతని స్థానంలో కొత్త డీఎస్పీ గా శ్రీనివాస్ నియమితులయ్యారు..
లగచర్ల ఘటనలో గ్రామస్థులను, రైతులను రెచ్చగొట్టింది సురేష్ కాదు ఒక ప్రభుత్వ ఉద్యోగి అని స్పష్టమైంది. వాస్తవానికి లగచర్ల గ్రామస్థులను, రైతులను రాఘవేందర్ అనే పంచాయితీ సెక్రటరీ రెచ్చగొట్టినట్లు గుర్తించారు. అధికారులపై దాడికి సిద్దంగా ఉండాలని ప్రేరేపించారు రాఘవేందర్. వికారాబాద్ జిల్లా సంగయ్యపల్లిలో పని చేస్తున్నారు రాఘవేందర్. రాఘవేందర్ ను ఇప్పటికే సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు పంచాయితీ సెక్రెటరీ రాఘవేందర్ కూడా ఉన్నట్లు సమచారం..!
కడియం సవాలును స్వీకరిస్తున్నానని చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. కడియం శ్రీహరి స్థానికేతరుడు అని.. ఆయన్ను పర్వతగిరి పంపించే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో నువ్వో నేనో మిగలాలని కడియం శ్రీహరి అంటున్నాడని.. ఆయన ఎక్కడ కూడా తనకు పోటీ రాలేడని రాజయ్య అన్నారు. తాను వరుసగా నాలుగుసార్లు గెలిచానని గుర్తుచేశారు. కడియం శ్రీహరి ప్రజా నాయకుడు కాదని.. రాజకీయ నాయకుడు మాత్రమేనని విమర్శించారు. కడియం స్థానికేతరుడు అని.. ఆయన్ను తప్పకుండా తరిమికొడతానని అన్నారు.
కడియం శ్రీహరి విసిరిన సవాలును స్వీకరిస్తున్నా అని తాటికొండ రాజయ్య అన్నారు. ‘ నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. ఇక్కడే ఉంటా.. రేపు ఛస్తే ఇక్కడే నన్ను బొంద పెడతారు. ‘ అని చెప్పారు. కానీ నిన్ను స్థానికేతరుడిలాగే గుర్తిస్తారని కడియం శ్రీహరిని ఉద్దేశించి రాజయ్య పేర్కొన్నారు. ఆయన్ను పర్వతగిరికి పంపించే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు.
సత్యహరిశ్చంద్రుడిలా నీతిమంతుడినని కడియం శ్రీహరి డబ్బా కొట్టుకోవడం సిగ్గు చేటు అని రాజయ్య విమర్శించారు. ఆయన అనేక అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి తిమింగలంలా అయ్యాడని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కడియం శ్రీహరి రూ.100 కోట్లు ఖర్చు చేశారని తెలిపిన ఆయన.. ఆ 100 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు.