కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్ లోని కోర్టులో హాజరుపరిచారు..కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత..
అయితే నరేందర్ రెడ్డిని కోర్టుకు తరలిస్తున్న సమయంలో కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నరేందర్ రెడ్డిని తరలిస్తున్న కారును బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది..
రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు..!
లగచర్ల ఘటనలో కలెక్టర్ పై దాడికి కుట్ర చేశారన్న అభియోగాలపై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం పోలీసులు హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలోనే నరేందర్ రెడ్డిని పోలీసులు విచారణ అనంతరం కొడంగల్ కోర్టుకు తరలించారు. పోలీసులు కోర్టులో నరేందర్ రెడ్డిని హాజరుపరిచగా… కోర్టు నరేందర్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే.. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాడికి పాలడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచరించామని, నిందితుడు విశాల్ తోపాటు గ్రామం లో కొంతమంది సాక్షుల విచారణలో ప్రధాన కుట్రదారుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గా తేలిందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ది కీలక పాత్ర గా తేలిందని, హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్ల కు చెందిన రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టాడని పోలీసులు తెలిపారు. నిందితుడు బోగమోని సురేష్‌ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్‌వాష్ చేయించాడని, నిందితులకు ఆర్థిక, నైతిక సహాయంతో సహా అన్ని సౌకర్యాలను అందించాడన్నారు..