వైసీపీ మున్సిపల్ చైర్మన్‌ అభ్యర్థుల ఖరారు…

వైసీపీ మున్సిపల్ చైర్మన్‌ అభ్యర్థుల ఖరారు..

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ కూసింది. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు…
దీంతో YSR CP మున్సిపాలిటీల్లో రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే ఖరారైన రిజర్వేషన్లతో అభ్యర్థుల ఎంపికపై హడావిడి మొదలైంది. కూటమి పార్టీలతో పాటు వైసీపీ సైతం గెలుపు గుర్రాల కోసం అన్వేషణ చేస్తోంది. ఆయా సీట్లను అశించే ఆశావహులు సైతం ఎవరికివారు తమదైన శైలిలో పైరవీలకు తెర లేపారు..

ఆరు మున్సిపాలిటీల్లోనూ..

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ మున్సిపల్‌ చైర్మన్లలో బీసీలకు-4, జనరల్‌ మహిళకు-1, ఎస్టీ జనరల్‌-1 కేటాయించారు. ఆరు మున్సిపాలిటీల్లో 212 వార్డుల్లో బీసీలకు-72, జనరల్‌ మహిళలకు-59, అన రిజర్వుడ్‌-47, ఎస్టీలకు- 08, ఎస్సీలకు- 26 చొప్పున కేటాయించారు. ఈ లెక్కన212 వార్డుల్లో బీసీలకు 72 స్థానాలు, మహిళలకు 59 స్థానాలు కేటాయించి ఆయా వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించినట్లైంది.

వైసీపీ మున్సిపల్ చైర్మన్‌ అభ్యర్థుల ఖరారు..!

పలాస-శ్రీపద్మ, నర్సీపట్నం-చింతకాయల అనిత
యలమంచిలి-బి.తులసి, తుని-రామతులసి
కొవ్వూరు-మన్నె పద్మ, రామచంద్రపురం-నాగేశ్వరరావు.

ఇచ్ఛాపురం-రాజ్యలక్ష్మి, కొండపల్లి-నల్లమోతు తేజస్వి.

తెనాలి-మద్దాలి శేషాచలం, చీరాల-ఇస్తర్ల షెర్లి
బద్వేల్-వెంకటసాయికృష్ణ, పులివెందుల-వైఎస్ ప్రమీలమ్మ
మదనపల్లె-జింకా చలపతి, ప్రొద్దుటూరు-నరసింహారెడ్డి.