ఏపీలో 13 ఏళ్ల లోపు వయసు ఉన్నవారికి సోషల్ మీడియా బ్యాన్…!
అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు
90 రోజుల్లో దీన్ని అమలు చేస్తామని ప్రకటన
16 ఏళ్ల లోపు ఉన్నవారిపై కూడా నిషేధం ఉండాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాము – చంద్రబాబు నాయుడు..
డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలవుతున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.పిల్లల మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేస్తుండగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో పయనించనుంది. దీనికి సంబంధించి 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇదే సమయంలో 13 -16 లోపు పిల్లలకు సంబంధించి సోషల్ మీడియా వాడకంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ అంశంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పటికే పార్లమెంటులో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. చిన్న పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టడానికి జాతీయ స్థాయిలో చట్టం రావాలని ఆయన ఆకాంక్షించారు…