తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షతను మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేస్తూ, అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో నిర్వహించిన ‘లీడర్షిప్ ఫర్ ద 21st సెంచరీ’ అనే ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను పూర్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 62 మంది ప్రముఖులతో కలిసి ఆయన ఈ శిక్షణలో పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా సమస్యలను పరిష్కరించడం, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం శిక్షణ కేవలం తరగతి గది బోధనకే పరిమితం కాకుండా, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సాగింది. బోస్టన్లో ప్రస్తుతం చలి తీవ్రత విపరీతంగా ఉండటంతో, మైనస్ 15 నుండి మైనస్ 24 డిగ్రీల సెల్సియస్ వంటి గడ్డకట్టే ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి తన క్లాసులకు హాజరయ్యారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ సుదీర్ఘ సెషన్లలో ఆయన ఉత్సాహంగా పాల్గొని, చర్చల్లో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ విద్యా కార్యక్రమం ముగింపు సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు విద్యార్థులందరికీ ధృవీకరణ పత్రాలను (Certificates) అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సర్టిఫికేట్ను అందుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.